ఎమ్మెల్యే షకీల్కు నిరసన సెగ

 ఎమ్మెల్యే షకీల్కు నిరసన సెగ

నిజామాబాద్ జిల్లా: బోధన్ మండలం హున్సా గ్రామంలో ఎమ్మెల్యే షకీల్ కు నిరసన సెగ తగిలింది. గ్రామంలో దళిత బంధు స్కీం కింద ఓ షాపు ప్రారంభోత్సవానికి వెళ్లిన శాసనసభ్యుడు షకీల్ ను గ్రామస్ధులు అడ్డుకున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, పెన్షన్లు రావడం లేదంటూ ఎమ్మెల్యేను నిలదీశారు. గ్రామంలో ఎలాంటి అభివృద్ది జరగలేదంటూ మండిపడ్డారు. దీంతో ఎమ్మెల్యే షకీల్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.