
న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ/ తెలంగాణ భవన్ కు శుక్రవారం బాంబు బెదిరింపు వచ్చింది. రెండు రాష్ట్రాల బిల్డింగ్‌ను పేల్చివేసి మట్టిలో కలిపేస్తామని దుండగులు ఈ మెయిల్ లో వార్నింగ్ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం ప్రతి శుక్రవారం కేంద్రంలోని సీనియర్ ఉన్నతాధికారుల కోసం ఒక సినిమా ప్రదర్శిస్తున్నది.
అందులో భాగంగా రాత్రి 8:30 కు ‘‘పూలే’’ సినిమా ప్రదర్శించారు. ఈ టైంలో బాంబు కాల్ రావడంతో అధికారులు అప్రమత్తపై జాగిలాలతో తనిఖీలు చేసి ఏమి లేదని తేల్చారు. అయితే పహల్గాం టెర్రరిస్టు ఎటాక్ తర్వాత దేశ రాజధాని ఢిల్లీ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్, ఇండియా గేట్ కు కూత వేటు దూరంలో ఉన్న ఏపీ, తెలంగాణ భవన్ కు మెయిల్ రావడం భయభ్రాంతులకు దారితీసింది.