
ప్రతిరోజు కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ప్రజల అవసరాలను బట్టి భారతీయ రైల్వే రైళ్లను కొన్ని వందల రైళ్లను నడుపుతుంది. అలాగే ప్రయాణీకుల సురక్షితమైన ప్రయాణానికి కొన్ని రూల్స్ కూడా పెట్టింది. వాటిలో లగేజ్ తీసుకెళ్లడంపై కొన్ని రూల్స్ ఉన్నాయి. అయితే, రైళ్లలో లగేజ్ బరువు ఎంత ఉండాలి అనేది చాలా మందికి తెలియదు. అసలు లగేజ్ చెకింగ్ ఎక్కడ చేస్తారు, ఎవరైన పరిమితికి మించి లగేజ్ తీసుకెళ్తే ఎం జరుగుతుంది, ఈ ప్రశ్నలు చాల మందికి ఉంటాయి. అందుకే ముందుగా రైల్వే లగేజ్ రూల్స్, జరిమానాల గురించి మీరు తెలుసుకోవాలి...
లగేజీ ఎక్కడ చెక్ చేస్తారు: ప్రయాణీకుల లగేజ్ బరువు చెక్ చేయడం అనేది ప్రతిసారి జరగదు. అయితే, లగేజ్ స్కానర్లు ఏర్పాటు చేసిన ప్రముఖ రైల్వే స్టేషన్లలో లేదా పార్శిల్ ఆఫీస్ దగ్గర చెకింగ్ చేయవచ్చు. రైలు టికెట్ ఎగ్జామినర్లు (TTEలు), లగేజ్ ఇన్స్పెక్టర్లు కూడా చాలా పెద్దగా లేదా భారీగా కనిపించే లగేజీని ఆగి మరి చెక్ చేయవచ్చు.
ALSO READ : స్మార్ట్ ఫోన్ వాడకపోతే ఇన్ని జరుగుతాయా: మీ మెదడులో జరిగే అద్భుతం!
సెక్యూరిటీ చెకింగ్ సమయంలో భద్రతా సిబ్బంది లగేజ్ బరువును కూడా చెక్ చేయవచ్చు. టీవీలు, పెద్ద సూట్‌కేసులు, పెట్టెలు వంటి పెద్ద వస్తువులపై ప్రత్యేకంగా నిఘా ఉంటుంది.
మీరు ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చు అంటే :
జనరల్ క్లాస్ - 35 కిలోల వరకు (ఉచితం)
స్లీపర్ క్లాస్ - 40 కిలోల వరకు (ఉచితం)
థర్డ్ ఏసీ - 40 కిలోల వరకు (ఉచితం)
సెకండ్ ఏసీ - 50 కిలోల వరకు (ఉచితం)
ఫస్ట్ ఏసీ - 70 కిలోల వరకు (ఉచితం)
ఒకవేళ ఇంతకంటే ఎక్కువ లగేజ్ తీసుకెళ్తే పార్శిల్ ఆఫీసులో ముందుగానే ఎక్స్ట్రా లగేజ్ టికెట్ తీసుకోవాలి.
ఎక్కువ లగేజీ తీసుకెళ్తే ఎం జరుగుతుంది: ఎక్స్ట్రా లగేజ్ టికెట్ తీసుకోకపోతే లేదా పట్టుబడితే TTE లేదా లగేజ్ ఇన్స్పెక్టర్ జరిమాన విధించవచ్చు. ఈ జరిమానా మీ లగేజ్ బరువు, మీరు వెళ్లే దూరం మీద ఆధారపడి ఉంటుంది.