స్మార్ట్ ఫోన్ వాడకపోతే ఇన్ని జరుగుతాయా: మీ మెదడులో జరిగే అద్భుతం!

స్మార్ట్ ఫోన్ వాడకపోతే  ఇన్ని జరుగుతాయా: మీ మెదడులో జరిగే అద్భుతం!

స్మార్ట్ ఫోన్ వాడకం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. టెక్నాలజీకి స్మార్ట్ ఫోన్ వాడకం తోడవడంతో వయస్సు పరిమితి లేకుండా ప్రతిఒక్కరి చేతిలో ఇది తప్పసరి అయ్యింది. అయితే స్మార్ట్ ఫోన్ అతిగా వాడడం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో... దానిని ఎంత తక్కువ వాడితే అన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ ఆరోగ్యం, మెదడులో చాల మార్పులు  తెస్తుంది.

అయితే కొందరికి ఒక్క సెకండ్ స్మార్ట్ ఫోన్ కనిపించకుండపోయిన  లేదా పోయింది అనగానే గుండె జారిపోతుంది. అలాంటిది ఒక గంటపాటు ఫోన్‌ లేకుండా దూరంగా ఉంటే... దీని వల్ల మీలో కలిగే మార్పులు ఏంటో తెలుసా.. అసలు స్మార్ట్ ఫోన్ లేకుండా దూరంగా ఉండడం  వల్ల ప్రతి గంటకు మీకు జరిగే మార్పులు ఎలా ఉంటాయంటే...   

మొదటి 15 నిమిషాలకి ఫాంటమ్ బజ్: మీరు ఏదో కోల్పోయినట్లు, ప్రశాంతత లేకుండా ఉండొచ్చు. దీని వల్ల మీ మెదడులో ఒత్తిడితో ఫోన్ వైబ్రేట్ అయినట్లు అనిపించడం లేదా ఈ అలవాటు నుంచి బయటపడాలని చూడటం లక్షణాలు.

15–30 నిమిషాలకి డోపమైన్ డిప్: ఒకేసారి  స్క్రీన్ చూడడం లేకపోవడం వల్ల డోపమైన్ లెవెల్స్ తగ్గుతుంది. దీనివల్ల విసుగుగా, అసౌకర్యంగా, ఆందోళనగా కూడా అనిపిస్తుంది. తరువాత మీ మెదడు మరోచోట ఆనందాన్ని వెతకడం ప్రారంభిస్తుంది.

30–60 నిమిషాలకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది: ఫోన్ లేదనే ఆలోచనలు, ఒత్తిడి తగ్గడం మొదలవుతుంది. ఏకాగ్రత తిరిగి వస్తుంది.   మీ మెదడు ఆల్ఫా తరంగాలను ఎక్కువగా ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది.  ఇవి సృజనాత్మకత, ప్రశాంతమైన ఆలోచనలకు సంబంధించినవి.

1–1.5 గంటలకి నిజమైన ప్రపంచం పై దృష్టి : ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మళ్ళీ గమనించడం ప్రారంభిస్తారు. మాటలు స్పష్టంగా అనిపిస్తాయి. మీ మెదడు ఒకేసారి చాల పనులు చేయకుండా ఉండడం వల్ల మీ జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

1.5–2 గంటలకి సాధారణ స్థితికి  నాడీ వ్యవస్థ : ఈ సమయంలో గుండె కొట్టుకునే స్పీడ్ తగ్గుతుంది. స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ స్థిరపడుతుంది. పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ శరీరం విశ్రాంతి తీసుకోవడానికి, తిరిగి కోలుకోవడానికి సహాయపడుతుంది.

2–3 గంటలకి లోతైన దృష్టి : మీరు డిప్ వర్క్ మోడ్లోకి వెళ్తారు. ఫోన్ సమస్య లేకుండా మీ మెదడు ఎక్కువసేపు ఒకేపనిపై దృష్టి పెడుతుంది. సృజనాత్మకత, చదవడం లేదా తెలివిగా ఆలోచనలకు ఇది సరైనది.

మీరు vs మీ ఫోన్: మీరు మూడు గంటలు ఫోన్‌కు దూరంగా ఉండటం వల్ల అతి ఉత్తేజాన్ని తగ్గిస్తుంది, ఆందోళనను తగ్గించవచ్చు, ఆలోచనలను మెరుగుపరుస్తుంది.