కుక్కల్ని చంపించినందుకు మున్సిపల్  కమిషనర్ పై కేసు

కుక్కల్ని చంపించినందుకు మున్సిపల్  కమిషనర్ పై కేసు

నర్సాపూర్, వెలుగు: కుక్కలను చంపించినందుకు మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ అశ్రుత్ కుమార్ పై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదైంది. నర్సాపూర్ పట్టణంలో కుక్కల బెడద ఎక్కువైందని కొంతమంది ఫిర్యాదు చేయగా, మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు దాదాపు 200 కుక్కలను చంపి పాతిపెట్టారు. విషయం తెలుసుకున్న పీపుల్స్ ఫర్ ఎనిమల్స్ ప్రతినిధులు పృథ్వి, గౌతం నర్సాపూర్​పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం మున్సిపల్ కమిషనర్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గంగరాజు చెప్పారు. నర్సాపూర్ పట్టణ సమీపంలో డంపింగ్ యార్డు వద్ద పాతిపెట్టిన కుక్కల కళేబరాలను పశుసంవర్థక శాఖ ఏడీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో వెలికితీయించి పోస్టుమార్టం నిర్వహించారు.