అడ్వకేట్ దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలి

అడ్వకేట్ దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలి

పెద్దపల్లి జిల్లాలో జరిగిన హైకోర్టు అడ్వకేట్ వామనరావు దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ సందర్భంగా తెలంగాణ పోలీసులు సరిగా దర్యాప్తు చేయడం లేదని పిటిషనర్ ఆరోపించారు. మరణ వాంగ్మూలంలో పుట్ట మధు పేరు చెప్పినప్పటికీ పోలీసులు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చారని న్యాయవాది సుప్రీంకు తెలిపారు. ఇక ఈ కేసులో ఇప్పటికే తెలంగాణ డీజీపీ సహా 12 మంది ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామం దగ్గరలో పట్టపగలే నడిరోడ్డుపై వామనరావు దంపతులపై దుండగులు దాడి చేశారు. 

కోర్టు పనిమీద మంథనికి కారులో వచ్చి… తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా… వీళ్ళని కల్వచర్ల దగ్గర అడ్డుకుని కత్తులతో విచరక్షణారహితంగా దాడి చేశారు. దంపతుల్ని కారు దిగనీయకుండానే…. లోపలే దాడికి పాల్పడ్డారు. కొన ఊపిరితో ఉన్న దంపతులను హాస్పిటల్ కు తీసుకెళ్తుండగానే చనిపోయారు. కారులో వెళ్తున్న వామనరావు.. అతని భార్య నాగమణిపై కత్తులతో దాడి చేశారు. అడ్వకేట్ వామన్ రావు చనిపోతూ… తనపై హత్య చేసిన వ్యక్తి పేరు కుంట శ్రీను అని చెప్పారు.