రెపోరేటులో మార్పులేదు..FY 25 జీడీపీ వృద్ధి 7శాతం అంచనా:ఆర్బీఐ

రెపోరేటులో మార్పులేదు..FY 25 జీడీపీ వృద్ధి 7శాతం అంచనా:ఆర్బీఐ

RBI Monetary Policy: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( RBI) రెపోరేటులో ఎలాంటి మార్పు చేయలేదు. రెపోరేటును 6.5శాతం వద్ద స్థిరంగా ఉంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్దాస్ ప్రకటించారు. మరోవైపు ఫైనాన్షియల్ ఇయర్ 2025లో జీడీపీ వృద్ధి రేటు 7 శాతం ఉండబోతుందని అంచనా వేశారు. దీంతోపాటు ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5 శాతం చేరే అవకాశం ఉందని పేర్కొంది. ఆర్ బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో ఈ విషయాలను శుక్రవారం (ఏప్రిల్ 5) ప్రకటించారు.

భారత ఆర్థిక వ్యవస్థకు 2024-25 సంవత్సరానికి గాను GDP వృద్దిని 7శాతం గా అంచనా వేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. Q1 లో 7.1 శాతం,Q2 లో 6.9 శాతం, Q3, Q4లో 7శాతం ఉంటుందని అంచనా వేసింది. మరోవైపు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. Q1లో 4.9 శాతం, Q2లో 3.8 శాతం,Q3లో 4.6 శాతం,Q4లో 4.5 శాతం గా అంచనా వేయబడింది. 

రెపోరేటు అంటే ఏమిటీ? 

రెపోరేటు అనేది ఆర్బీఐ బ్యాంకులకు స్వల్పకాలిక నిధులను ఇచ్చే రేటు. రెపోరేటు ప్రస్తుత్తం 6.5 శాతం ఉంది. ఏప్రిల్ 2023 నుంచి మారలేదు.