మెడలో చైన్ లాక్కెళ్లి.. పాపను సంపులో పడేసిన స్నాచర్లు

మెడలో చైన్ లాక్కెళ్లి.. పాపను సంపులో పడేసిన స్నాచర్లు

జనగామ జిల్లా అంబేద్కర్ కాలనీలో దారుణం జరిగింది. చైన్ స్నాచర్ ఓ మహిళ మెడలో తాళి తెంపే ప్రయత్నం చేశాడు . బైక్ పై వచ్చిన చైన్ స్నాచర్ తో  ఆ మహిళ ప్రతిఘటించింది . దీంతో మహిళకు- చైన్ స్నాచర్ కు మధ్య గొడవ జరిగింది. ఇదే టైంలో చైన్ స్నాచర్.. మహిళ చేతిలో ఉన్న తొమ్మిది నెలల పాపను లాక్కొని వెళ్లాడు. అయితే పాప మెడలో ఉన్న చైన్ ను లాక్కెళ్లి.. పాపను నీటి సంపులో పడేశారని పాప తల్లి చెబుతోంది. నీటి సంపులో పడిన పాపా స్పాట్ లోనే చనిపోయింది. 

రాష్ట్రంలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచర్ల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దొంగతనం చేసే సమయంలో ప్రాణాలు తీయటానికైనా వెనుకాడటంలేదు. మహిళలపై దాడులే కాదు.. ఏకంగా పట్టుకోబోయిన పోలీసులపైనా దాడులు చేస్తున్నారు. ఈమధ్య మియాపూర్ పీఎస్ పరిధిలో చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు ప్రయత్నించిన యాదయ్య అనే కానిస్టేబుల్ పై కత్తితో దాడిచేశారు స్నాచర్లు. చాలెంజ్ గా తీసుకున్న పోలీసులు చైన్ స్నాచర్లను అరెస్ట్ చేసి వారి నుంచి.. 2 తుపాకులు, 15 తూటాలు, 2 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ కూకట్ పల్లి పరిధిలోనూ మహిళ మెడలో చైన్ లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. చైన్ తెగకపోవటంతో అలాగే కొంతదూరం లాక్కెళ్లారు. ప్రాణాపాయ స్థితికి చేరిన ఆమెను లక్షలు ఖర్చుచేసి చికిత్స అందించారు. ఇలాంటి ఘటనలు ఘటనలు నగరంలోనే కాక జిల్లాల్లోనూ రిపీటవుతున్నాయి.