ఎలా ఉన్నారో : 30 రోజుల తర్వాత.. చంద్రబాబును చూడబోతున్న జనం..

ఎలా ఉన్నారో : 30 రోజుల తర్వాత.. చంద్రబాబును చూడబోతున్న జనం..

నెల రోజులకు పైగా చంద్రబాబు( Chandrababu) రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు.  కోర్టుకు కూడా అధికారులు వర్చువల్ విధానంలోనే చంద్రబాబును హాజరుపర్చారు. చంద్రబాబుపై  నాలుగైదు కేసుల వరకు కోర్టులో విచారణ జరుగుతున్నాయి.  ఒక్క స్కిల్ డెవలప్ మెంట్ కేసులోనే చంద్రబాబును అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.  ప్రస్తుతం ఫైబర్ నెట్ కేసులో  సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు సమ్మతించింది. సోమవారం ( అక్టోబర్ 16) ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల లోపు  చంద్రబాబును  వ్యక్తిగతంగా కోర్టులో హాజరుపర్చాలని జడ్జ్  ఆదేశాలు జారీ చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు ఈనెల 19వరకు జ్యూడీషియల్‌ రిమాండ్‌ ఉంది. ఈక్రమంలో సోమవారం ( అక్టోబర్ 16)  వ్యక్తిగతంగా చంద్రబాబును హాజరుపర్చాలని న్యాయాధికారి ఆదేశించారు.

ALSO READ: చంద్రబాబుకు అలర్జీ.. హడావిడిగా జైలుకు వచ్చిన డాక్టర్లు

దీంతో నెలరోజుల తరువాత చంద్రబాబు జైలు నుంచి బయటకు రానున్నారు.  ఆయనకు ఎస్కార్ట్.. పోలీసు వాహనాలు కొత్త కాకపోయినా... గతంలో ఉన్న పరిస్థితి వేరు .. ఇప్పుడున్న పరిస్థితి వేరు కదా... ఆయనకు హోం ఫుడ్ కు కోర్టు అనుమతిచ్చినా... బంధీగానే ఉన్నారు.  జైలుకు వెళ్లిన తరువాత చంద్రబాబు మొదటి సారిగా బయటకు వస్తున్నారు.   మరి ఆయన నెల రోజులు జైలులో ఎలా ఉన్నారోనని టీడీపీ శ్రేణులకు ఆందోళన ఉన్నా... ఆయన  సోమవారం రాజమండ్రి నుంచి విజయవాడ ఏసీబీ కోర్టుకు పోలీసులు తీసుకొస్తున్నారు.   ఈ క్రమంలో చంద్రబాబును చూసేందుకు జనాలు కూడా భారీగా వచ్చే అవకాశం ఉంది.. చంద్రబాబుకు జైల్లో సరైన వసతులు లేవంటూ.. ములాఖత్ కు వెళ్లి వచ్చిన తరువాత భువనేశ్వరి మీడియాతో అన్నారు.  దోమలు కుడుతున్నాయంటూ.. వేడి నీళ్ల సౌకర్యం ఇవ్వలేదని ఆరోపణలు చేసిన సందర్భంలో చంద్రబాబు సోమవారం బయటకు రావడంతో ఆయన ఎలా ఉన్నారోనని చూసేందుకు టీడీపీ అభిమానులు ఆశక్తి చూపుతున్నారు