చంద్రబాబుకు అలర్జీ.. హడావిడిగా జైలుకు వచ్చిన డాక్టర్లు

చంద్రబాబుకు అలర్జీ.. హడావిడిగా జైలుకు వచ్చిన డాక్టర్లు

మాజీ చంద్రబాబు అనారోగ్యం బారిన పడ్డారు.. రాజమండ్రిలో ఎండ ఎక్కువగా ఉండటం.. ఉక్కబోత ఉండటంతో అలర్జీకి గురయ్యారు.. ఒంట్లో బాగోలేదని.. అలర్జీతో బాధపడుతున్నట్లు జైలు అధికారులకు.. చంద్రబాబు సమాచారం ఇవ్వటంతో.. వారు రాజమండ్రి ప్రధాన ఆస్పత్రికి సమాచారం ఇచ్చారు. దీంతో అక్టోబర్ 12వ తేదీ సాయంత్రం.. ఆస్పత్రి నుంచి ప్రత్యేక డాక్టర్ల బృందం రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చింది. చంద్రబాబుకు ప్రత్యేకంగా కేటాయించిన బ్యారక్ లోనే చికిత్స అందిస్తున్నారు. 

రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుకు ఇప్పటికే ప్రత్యేక వసతులు కల్పించారు. కూలర్ పెట్టారు.. వేడి నీళ్లు కూడా ఇస్తున్నారు.. 40 ఏళ్లుగా ఏసీల్లోనే ఉండటం.. ఏసీల్లో తిరిగిన చంద్రబాబు.. సాధారణ కూలర్ కింద సేదతీరటం ఇబ్బందిగా మారింది. ఇంటి నుంచి భోజనం వస్తున్నా.. వసతులపై చంద్రబాబు కుటుంబ సభ్యులు తరచూ విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు.

ALSO READ: ఎలా ఉన్నారో : 30 రోజుల తర్వాత.. చంద్రబాబును చూడబోతున్న జనం..

ఈ క్రమంలోనే రాజమండ్రిలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో డీహైడ్రేషన్ కు గురయ్యారు.. ఉక్కబోతతో అలర్జీకి గురైనట్లు తెలుస్తుంది. జైలు అధికారుల సమాచారంతో.. రాజమండ్రి జిల్లా ప్రభుత్వ డాక్టర్ల బృందం జైలుకు వచ్చి చంద్రబాబుకు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలిసిన టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళనగా ఉన్నారు.. తమ అధినేత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.. ఆకాక్షిస్తున్నారు.