అనుచిత వ్యాఖ్యల కేసులో సీఎం తండ్రి అరెస్ట్

అనుచిత వ్యాఖ్యల కేసులో సీఎం తండ్రి అరెస్ట్

ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్ బఘేల్ తండ్రి నందకుమార్ బఘేల్ ఒక వర్గం వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయ్యారు. రాయ్ పూర్ పోలీసులు ఆయనను మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించారు. సమాజంలోని ఓ వర్గం వారు విదేశీయులంటూ కించపరిచేలా నందకుమార్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. 

ముఖ్యమంత్రి అయిన ఆయన కుమారుడు భూపేష్ బఘేల్ స్పందించి తండ్రి వ్యాఖ్యలను ఖండించారు. అంతేకాదు పోలీసులు కేసు నమోదు చేయడాన్ని స్వాగతించిన విషయం తెలిసిందే. ఓ తండ్రిగా ఆయనను వ్యక్తిగతంగా గౌరవిస్తానని, అయితే మతసామరస్యం దెబ్బతినేలా ఎవరు ప్రవర్తించినా క్షమించలేనని స్పష్టం చేశారు. నా తండ్రయినా సరే చట్టానికి లోబడి ఉండాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. తన అరెస్టుపై నందకుమార్ స్పందించి ఇలాంటి చర్యలకు భయపడేదిలేదన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళతానని స్పష్టం చేశారు.

Related News

బ్రాహ్మణులను ఓల్గా నది ఒడ్డుకు పంపేయాలని..

గుడి దేవుడి సొత్తు.. ఆస్తులకు ఆయనే యజమాని