రూ. 99 కే తిన్నంత బిర్యానీ...వేస్ట్ చేస్తే మాత్రం..

రూ. 99 కే తిన్నంత బిర్యానీ...వేస్ట్ చేస్తే మాత్రం..

హోటళ్లు, ఇతర రెస్టారెంట్లలో బీర్యాని ధర ఎంత ఉంటుంది. పెద్ద హోటళ్లు , పెద్ద రెస్టారెంట్లలో మినిమమ్ రూ. 200 పైనే ఉంటుంది. చిన్న హోటళ్లు, ఇతర చిన్న రెస్టారెంట్లలో  రూ.150 వరకు ఉంటుంది. అయితే రూ. 200 పెట్టినా..రూ. 150 పెట్టినా కూడా బిర్యానీ ఒకరికి సరిపోదు. అంటే ఒక వ్యక్తి కడుపునిండా తినలేడు. కానీ ఒక్క చోట కేవలం రూ. 99 కే చికెన్ బిర్యానీ పెడుతున్నారు. అది కూడా ఎంత తింటే అంత. ఇది నిజం. రూ. 99 కే తిన్నంత బిర్యానీ దొరుకుతుంది. 

రూ. 99 కే తిన్నంత బిర్యానీ ఎక్కడంటే..

హైదరాబాద్ నగరం నడిబొడ్డున రూ. 99కే తిన్నంత బిర్యానీ పెడుతున్నారు. అమీర్ పేట్ మైత్రివనం దగ్గర కేవలం రూ. 99 కే తిన్నంత చికెన్ బిర్యానీ అందిస్తున్నారు.  

రేటు తక్కువ టేస్ట్ ఎక్కువ..

రూ. 99 కే తిన్నంత పెట్టేది హోటల్, రెస్టారెంట్లో కాదు.. రోడ్డు పక్కన తోపుడు బండిలో. ఇక్కడ రేట్లు తక్కువ ఉండటంతో టేస్ట్ ఎలా ఉంటుందో అని అనుకుంటున్నారా..రేట్లు తక్కువ అయినా..టేస్ట్ మాత్రం అదురుద్ది. ఈ రూ. 99 బిర్యానీ కోసం జనం పోటీపడతారు. లైన్లో నిలుచుని మరీ రూ. 99 బిర్యానీ తింటారంటే టేస్ట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రతీ రోజూ 600 మందికి పైగా ఇక్కడ రూ. 99 బిర్యానీని టేస్ట్ చేస్తారు. 

వేస్ట్ చేస్తే జరిమానా..

రూ. 99కే తిన్నంత బిర్యానీ  అంటే చాలా మంది ఎగేసుకుని ఎక్కువ వేసుకున్నారో మీరు జరిమానా కట్టాల్సిందే. ఎందుకంటే ఈ సెంటర్లో రూ. 99కే తిన్నంత పెడతారు..కానీ వేస్ట్ చేస్తే మాత్రం రూ. 200 ఫైన్ విధిస్తారు. 

బిర్యానీ రేట్లు ఇవే..

  • చికెన్ ధమ్ బిర్యానీ ఎంత తింటే అంత. రూ. 99
  • ఎగ్ ధమ్ బిర్యానీ ఎంత తింటే అంత. రూ. 79 
  • చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎంత తింటే అంత. రూ. 99
  • బిర్యానీ వేస్ట్ చేస్తే మాత్రం రూ. 200 ఫైన్