డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల తాళాలు ఇవ్వాలి : చుక్క రాములు

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల తాళాలు ఇవ్వాలి :  చుక్క రాములు
  • సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు

జహీరాబాద్, వెలుగు: జహీరాబాద్ మున్సిపల్  పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు ఇవ్వకపోవడం సరైంది కాదని  సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో జహీరాబాద్ తహసీల్దార్ ఆఫీసు ముందు చేపట్టిన ఆందోళనలో లబ్ధిదారులకు మద్దతుగా పాల్గొన్నారు. ఆందోళనకు స్పందించిన తహసీల్దార్ దశరథ్, సీఐ శివలింగం లబ్ధిదారుల తో చర్చించారు. విషయాన్ని కలెక్టర్ కు తెలియజేశారు. 

ఆయన ఆదేశాల మేరకు ఈనెల 13న లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు ఇస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. అనంతరం చుక్కా రాములు మాట్లాడుతూ..ఇప్పటికే తాళాలు ఇస్తామని రెండుసార్లు అధికారులు హామీ నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి హామీనిలబెట్టుకోకపోతే లబ్ధిదారులే ఇళ్లలోకి వెళ్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు జయరాజు, రాంచందర్, మహిపాల్, ముతబీర్, రాజిరెడ్డి, బక్కన్న,  బాల్ రాజ్, సీఐటీయూ నాయకులు నరేశ్, వంశీ, కిరణ్, సాయి గౌడ్, బాబు, డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు  పాల్గొన్నారు.