కరోనా పరిహారం.. మృతుడి ఫ్యామిలీకి రూ.50 వేలు

కరోనా పరిహారం.. మృతుడి ఫ్యామిలీకి రూ.50 వేలు
  • అప్లై చేసుకున్న రెండు వారాల్లో చెల్లింపు 
  • కలెక్టర్ ఆఫీసులో ప్రత్యేక సెల్ ఏర్పాటు
  • ఉత్తర్వులిచ్చిన జగన్‌ ప్రభుత్వం

అమరావతి: కరోనాతో మరణించిన వారి ఫ్యామిలీలకు అప్లై చేసుకున్న రెండు వారాల్లోగా ఎక్స్‌‌‌‌‌‌‌‌గ్రేషియా చెల్లించాలని  ఏపీలోని జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిజాస్టర్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌ నుంచి రూ.50 వేల ఎక్స్‌‌‌‌‌‌‌‌గ్రేషియా ఇవ్వాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. కరోనా మృతుల లిస్ట్‌‌‌‌‌‌‌‌ ప్రిపేర్ చేయాలని, జిల్లా కలెక్టర్ ఆఫీసులో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. కొత్త ప్రొఫార్మాతో అప్లికేషన్‌‌‌‌‌‌‌‌ను రూపొందించామని తెలిపారు. డిస్ట్రిక్ట్‌ రెవెన్యూ ఆఫీసర్ ఆధ్వర్యంలో ప్రతి అప్లికేషన్‌కు స్పెషల్‌గా నెంబర్ కేటాయించాలని చెప్పారు.