సినిమా కథ బాగాలేదని.. స్క్రిప్టు, కంప్యూటర్లు ఎత్తుకెళ్లాడు!

సినిమా కథ బాగాలేదని.. స్క్రిప్టు, కంప్యూటర్లు ఎత్తుకెళ్లాడు!
  • పోలీసులకు సహ నిర్మాతల ఫిర్యాదు

జూబ్లీహిల్స్, వెలుగు: కథ బాగాలేదని ఓ నిర్మాత సినిమా స్క్రిప్టుతోపాటు డేటా, కంప్యూటర్లను బలవంతంగా ఎత్తుకెళ్లాడు. దీనిపై మిగిలిన నిర్మాతలు ఫిర్యాదు చేయడంతో మధురానగర్​పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కె. వెంకటనారాయణరెడ్డి పలువురు నిర్మాతలు కలిసి ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నారాయణరెడ్డి రూ.30 లక్షలు పెట్టాడు. అనంతరం కథ కొత్తగా లేదని మిగితా వారితో విభేదించి సినిమా నిర్మాణం నుంచి తప్పుకున్నాడు. 

ఇదిలా ఉండగా, మధురానగర్​పరిధిలోని శ్రీసాయి బాలాజీ నిలయంలో ఉన్న కార్యాలయం నుంచి తన అనుచరులు ఆదూరి ఉమామహేశ్వరరెడ్డి, టి. నవీన్ కుమార్​రెడ్డి, సాయి కలిసి దౌర్జన్యం చేసి సినిమా స్క్రిప్టుతోపాటు విలువైన కంప్యూటర్లు, డేటాను ఎత్తుకెళ్లాడు. దీనిపై ఫిర్యాదు రావడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.