ఫారెస్ట్ ఆఫీసర్ల అక్రమ వసూళ్లు

ఫారెస్ట్ ఆఫీసర్ల అక్రమ వసూళ్లు
  • కలెక్టర్ పర్మిషన్ ఇచ్చారంటూ బొగ్గు లారీల నిలిపివేత 

మణుగూరు, వెలుగు:  కలెక్టర్ పర్మిషన్ ఇచ్చారంటూ ఫారెస్ట్ ఆఫీసర్లు సింగరేణి నుంచి బొగ్గు లారీలను అడ్డు కొని వసూళ్లకు పాల్పడ్డారు. దీంతో లారీ ఓనర్లు బొగ్గు రవాణా నిలిపివేశారు. భద్రాద్రి జిల్లా మణుగూరు  ఓసీ –4 మైన్ నుంచి బీటీపీఎస్ బొగ్గు రవాణా చేసే లారీలను జీఎం ఆఫీస్ సమీపంలో గురువారం ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకున్నారు. ఫారెస్ట్ లోంచి వెళ్లే లారీల నుంచి రాయల్టీ వసూలు చేయాలని  కలెక్టర్ అనుమతి ఇచ్చారని ఒక్కో లారీకి రూ. 200 వసూలు చేస్తున్నారు. 

దీంతో లారీ యజమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  మణుగూరు సీఐ నాగబాబుకు తెలపగా వెళ్లి.. ఫారెస్ట్ అధికారులు లారీలను అడ్డుకుంటే కేసు నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎఫ్ డీవో మక్సుద్ ను వివరణ కోరగా.. లారీల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు  ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని తెలిపారు.