రాజీవ్​యువ వికాసం వెరిఫికేషన్ వేగవంతం చేయాలి : కలెక్టర్ ​రాహుల్ రాజ్​

రాజీవ్​యువ వికాసం వెరిఫికేషన్ వేగవంతం చేయాలి : కలెక్టర్ ​రాహుల్  రాజ్​

మెదక్​టౌన్, వెలుగు: రాజీవ్​యువ వికాసం దరఖాస్తుల వెరిఫికేషన్​ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్​రాహుల్​రాజ్​అధికారులను ఆదేశించారు. మంగళవారం అధికారులతో జూమ్​మీటింగ్​నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లా వ్యాప్తంగా యూనిట్ల వారీగా వచ్చిన దరఖాస్తుల గురించి తెలుసుకొని అధికారులకు పలు సూచనలు చేశారు. అర్హులకే ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని, గ్రౌండింగ్ పూర్తిచేయాలని సూచించారు. జిల్లాలోని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య, జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. 

15 రోజుల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తి

చిన్శ శంకరంపేట: మరో 15 రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందని  కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం చిన్న శంకరంపేట మండలం గవ్వలపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  పరిశీలించారు. ఆయన  మాట్లాడుతూ జిల్లాలో యాసంగి కొనుగోలు కేంద్రాలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని కోరారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యాం విక్రయించిన 48 గంటల్లో అకౌంట్​లో డబ్బులు పడే విధంగా చూస్తున్నామన్నారు. ఆయన వెంట తహసీల్దార్ మన్నన్, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు ఉన్నారు.