
- కలెక్టర్ రాహుల్ రాజ్
టేక్మాల్, వెలుగు: భారీ వర్షాలు, వరదల కారణంగా సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం టేక్మాల్ మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించి పెద్ద చెరువు వల్ల వరద ప్రవాహనికి గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో కురుస్తున్న భారీ వానల నేపథ్యంలో ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండలా మారాయని, నది, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున ముంపు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజలకు రాకపోకలు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.
రోడ్ల మీద నీరు పూర్తి స్థాయిలో తగ్గే వరకూ ప్రజలు బయటకు రాకూడదని, సహాయక చర్యల్లో ప్రజలు అధికారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు. వర్షాల వల్ల పాడైన పంట పొలాలను గుర్తించి పరిహారం అందేలా చూడాలని రైతలు కలెక్టరును కోరారు. ఆపద సమయంలో కంట్రోల్‌రూమ్‌కు ఫోన్‌చేసి సాయం పొందవచ్చని కలెక్టర్సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ తులసీరామ్, ఆర్ అండ్ బీ ఈఈ సర్దార్ సింగ్, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ పాపయ్య పాల్గొన్నారు.