
- కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్పట్టణంలోని రిమ్స్‌కు వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఇతర ఆస్పత్రులకు రిఫర్చేయకుండా ఇక్కడే వైద్యం అందేలా చూడాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. శనివారం కలెక్టర్ రిమ్స్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వార్డులు, రికార్డులను పరిశీలించారు. స్థానికంగా ఉన్న ప్రధానమంత్రి జన ఔషధి మెడికల్‌షాపులను తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అధునాతన సౌకర్యాలతో కూడిన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.
కార్పొరేట్ఆస్పత్రుల్లో రూ.లక్షల్లో నిర్వహించే సర్జరీలు ఇక్కడ ఉచితంగా చేస్తున్నారని, వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. నవజాత శిశు మరణాలు జరగకుండా ఎస్ఎన్సీయూ ప్రత్యేత్యంగా చికిత్సలు చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ తదితరులు ఉన్నారు.