వేసవిలో నీటి సమస్య రానివ్వొద్దు : కలెక్టర్ వెంకట్‌‌‌‌‌‌‌‌రావు

వేసవిలో నీటి సమస్య రానివ్వొద్దు : కలెక్టర్ వెంకట్‌‌‌‌‌‌‌‌రావు

సూర్యాపేట, వెలుగు: వేసవిలో తాగు నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ వెంకట్‌‌‌‌‌‌‌‌రావు మిషన్ భగీరథ ఇంజనీర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో జీపీలు, మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాపై అడిషనల్ కలెక్టర్ ప్రియాంక, సీఈ చెన్నారెడ్డిలతో కలసి సమీక్ష నిర్వహించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిషన్ భగీరథకు సంబంధించి 22 సమస్యలు ఉన్నాయని చెప్పారు.  ఫిబ్రవరి 15 వరకు కనెక్షన్లు, పైప్ డ్యామేజ్‌‌‌‌‌‌‌‌లకు సంబంధించిన 14 పనులను పూర్తి చేయాలని  సూచించారు.  మిగిలిన 8 మేజర్ పనులను ఫిబ్రవరి చివరి నాటికి పూర్తి చేయాలని  ఏజెన్సీలు, ఇంజనీర్లను ఆదేశించారు.  

వేసవిలో ఎక్కడైనా తాగునీటి సమస్య ఎదురైతే భగీరథ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో  జడ్పీ సీఈవో సురేశ్, ఈఈలు  కరుణాకర్ రెడ్డి, శ్రీనివాస్, డీపీవో యాదయ్య, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.