ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : వెంకటేశ్ ధోత్రే

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : వెంకటేశ్ ధోత్రే
  • కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే 

తిర్యాణి, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసిఫాబాద్​ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. శుక్రవారం తిర్యాణి మండలం గిన్నెదరిలోని పీహెచ్​సీ సెంటర్​ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులు, మందుల నిల్వలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. సీజనల్​ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో అవసరమైన మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆస్పత్రి పరిసరాలు క్లీన్ గా ఉంచాలని డాక్టర్లకు సూచించారు. ట్రీట్​మెంట్ కోసం వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. 

బ్లడ్ టెస్ట్  నిర్వహించాలని, విషజ్వరాలపై అలర్ట్​గా ఉండాలని సూచించారు. ప్రతి గ్రామంలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలన్నారు. అనంతరం గిన్నెదరి ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్​ను  పరిశీలించి స్టూడెంట్ల హాజరు, క్లాస్ రూమ్స్, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. టీచర్లు నాణ్యమైన బోధన అందించాలని, టెన్త్ క్లాస్ స్టూడెంట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. స్టూడెంట్లకు యూనిఫామ్ పంపిణీ చేశారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో మల్లేశ్, హెచ్​ఎం కృష్ణారావు, డాక్టర్లు కౌటిల్య తదితరులు పాల్గొన్నారు.