పకడ్బందీగా సమాచార చట్టం అమలు : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

పకడ్బందీగా సమాచార చట్టం అమలు : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి
  • కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి​

నిజామాబాద్, వెలుగు: జిల్లాలో సమాచార హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి తెలిపారు. గురువారం సమాచార హక్కు చట్టం 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్​ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కలెక్టరేట్​లో ఎల్​సీడీ స్క్రీన్​పై ఆయా శాఖల ఆఫీసర్లు వీక్షించారు. 

ఈ సందర్భంగా చట్టాన్ని గౌరవిస్తూ పౌరులు కోరిన సమాచారాన్ని పారదర్శకంగా, జవాబుదారీతనం పాటిస్తూ అందిస్తామని ఆఫీసర్లతో ప్రతిజ్ఞ చేయించారు. అడిషనల్ కలెక్టర్లు అంకిత్​, కిరణ్​కుమార్​, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్​ సందీప్​, ఏవో ప్రశాంత్​ తదితరులు ఉన్నారు.