కేరళలో శని,ఆదివారం పూర్తి లాక్ డౌన్ 

V6 Velugu Posted on Jul 21, 2021

దేశంలో కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి.. మళ్లీ విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో రెండు రోజుల పాటు లాక్డౌన్ విధించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 24, 25 తేదీల్లో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి కూడా జూన్ 12,13 తేదీల్లో విధించిన లాక్డౌన్ మార్గదర్శకాలే వర్తిస్తాయని తెలిపింది. దీనికి సంబంధించి ఉత్తర్వులను జారీ చేసింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కూడా ఆ రెండు రోజులు మూసివేయనున్నట్లు తెలిపింది. వివిధ ప్రాంతాల్లో నమోదవుతున్న పాజిటివిటీ రేటు ఆధారంగా ఆంక్షలు కొనసాగుతాయంది.

ఈ నెల 23 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల  కరోనా నమూనాలను పరీక్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది కేరళ ప్రభుత్వం. పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలపై ప్రధానంగా దృష్టి సారించాలని నిర్ణయించింది. 

Tagged July 24, Complete Lockdown, Kerala, 25

Latest Videos

Subscribe Now

More News