రాయితీలియ్యకుంటే  టాకీసులు మూతనే

రాయితీలియ్యకుంటే  టాకీసులు మూతనే

సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్ల ఓనర్స్ ఆవేదన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించే వరకు సినిమా హాళ్లు ఓపెన్ చేసే పరిస్థితి లేదని సింగిల్ స్క్రీన్ హాళ్ల ఓనర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్‌ను ఇప్పటికీ 15 సార్లు కలిసి విన్నవించినా ఫలితం లేదన్నారు. రెండేళ్ల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నామని ఇప్పటికైనా స్పందించి రాయితీలిచ్చి ఆదుకోవాలన్నారు. జంటనగరాల సినిమా టాకీసుల ఓనర్స్ సమావేశమై హాళ్లను తెరవడంపై చర్చించారు. పార్కింగ్ ఫీజును రద్దు చేయటంతో నష్టపోతున్నామని హాళ్ల సంఘం సెక్రటరీ విజయేందర్ రెడ్డి వెల్లడించారు. లాక్‌డౌన్లో సినిమా హాళ్లు నడవనందున ఆ టైమ్‌లో వసూలు చేసిన కరెంట్ బిల్లులను, ప్రాపర్టీ ట్యాక్స్ ను మాఫీ చేయాలన్నారు.