నోయిడా ఎయిర్ పోర్టుకు రేపు శంకుస్థాపన

నోయిడా ఎయిర్ పోర్టుకు రేపు శంకుస్థాపన

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ గౌతమ్ బుద్ధానగర్​లోని జెవార్​లో నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయ నున్నారు. ఇది అందుబాటులోకి వస్తే దేశంలోనే ఐదు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు కలిగిన ఏకైక రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ గుర్తింపు పొందనుంది. ఇది నేషనల్ క్యాపిట ల్ రీజియన్(ఎన్సీఆర్)లో రెండో ఎయిర్ పోర్టు కానుంది.

ఈమేరకు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మంగళవారం పేర్కొంది. మొత్తం 3,200 ఎకరాల్లో ఎయిర్ పోర్టును నిర్మించనున్నట్లు వెల్లడించింది. ఫస్ట్ ఫేజ్​లో ఏడాదికి కోటి మందికి పైగా ప్రయాణించేలా రూ.10,050 కోట్లతో సౌలతులు కల్పించనున్నట్లు తెలిపింది. 2024 వరకు తొలి దశ పనులు పూర్తవుతా యని చెప్పింది.