
- కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్
సిద్దిపేట రూరల్, వెలుగు: కబ్జా రాజకీయాలు భరించలేకే తాను కాంగ్రెస్పార్టీకి రాజీనామా చేస్తున్నానని కాంగ్రెస్నాయకుడు, ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..పార్టీ కోసం కష్టపడుతున్న తనను మైనంపల్లి హన్మంతరావు అసభ్యంగా తిట్టడంతో పాటు తనతో తిరిగే కార్యకర్తలపై అక్రమ కేసులు, రౌడీ షీట్లు పెడుతూ వేధిస్తున్నాడని ఆరోపించారు.
మైనంపల్లి బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిద్దిపేటలో భూకబ్జాలకు పాల్పడిన వారిని పార్టీలోకి తీసుకొని, ల్యాండ్ మాఫియాకు, రౌడీ షీటర్లకు మద్దతు పలుకుతూ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నారన్నారు. హైకమాండ్దృష్టి కి ఎన్నిసార్లు తీసుకువెళ్లిన మైనంపల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. సీఎం సిద్దిపేట మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడి ఇన్చార్జిని మారిస్తే తప్ప పార్టీ బాగుపడదన్నారు. సమావేశంలో మహ్మద్ అశ్వాక్, తిరుపతి శ్రీకాంత్, రంజిత్, పర్శరాములు, శివ పాల్గొన్నారు.