జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు అండగా నిలవాలి : అంజన్కుమార్ యాదవ్

 జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు అండగా నిలవాలి :  అంజన్కుమార్ యాదవ్
  • మాజీ ఎంపీ అంజన్​కుమార్ యాదవ్

జూబ్లీహిల్స్, వెలుగు: నగర అభివృద్ధి కాంగ్రెస్​తోనే సాధ్యమని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు అండగా నిలవాలని మాజీ ఎంపీ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్ కుమార్​యాదవ్​కోరారు. ఆదివారం ఎర్రగడ్డ, బోరబండ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నామని పేర్కొన్నారు. 

ఈ నియోజకర్గంలో కాంగ్రెస్​అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సమస్యలను తెలుసుకున్న ఆయన వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఎర్ర కృష్ణ, హబీబా సుల్తానా, మహేశ్, ఆకాశ్, గణేశ్​తదితరులు​పాల్గొన్నారు.