1,014 సెంటర్లలో టీనేజర్లకు కరోనా వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

1,014 సెంటర్లలో టీనేజర్లకు కరోనా వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • టీనేజర్లకు కరోనా వ్యాక్సినేషన్ షురూ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీనేజర్లకు కరోనా వ్యాక్సినేషన్ షురూ అయింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు వ్యాక్సినేషన్​ను సోమవారం ప్రారంభించారు. తర్వాత జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పిల్లలు కరోనా వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసుకునేలా చూడాల్సిన బాధ్యత పేరెంట్స్, స్కూల్, కాలేజ్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లదేనన్నారు. ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసుకున్న పిల్లలందరికీ నాలుగు వారాల తర్వాత సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేస్తామని తెలిపారు. అలాగే బూస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డోసు గురించి కేంద్రాన్ని చాలా కాలం నుంచి అడుగుతున్నామని, లెటర్ కూడా రాశామన్నారు. దేశంలో, రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులు పెరుగుతున్నాయని, వారం రోజుల్లోనే పాజిటివిటీ రేటు నాలుగు రెట్లు పెరిగిందని తెలిపారు. 100% ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేసిన తొలి పెద్ద రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందన్నారు. కరోనా థర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తే మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉంటే ప్రజలు వెంటనే టెస్టులు చేయించుకోవాలన్నారు. ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బెడ్ల సంఖ్యను పెంచేందుకు ఉత్తర్వులిచ్చామని తెలిపారు. బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని యూపీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ పక్కనే మెటర్నరీ కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పారు. 

1,014 సెంటర్లలో వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

15–18 ఏండ్ల మధ్యలో 18.4 లక్షల మంది ఉండగా, తొలిరోజు 24,240 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అత్యధికంగా నిజామాబాద్​ జిల్లాలో 2,408 మంది టీనేజర్లు వ్యాక్సిన్​ తీసుకోగా.. సిరిసిల్లలో అత్యల్పంగా 36 మంది తీసుకున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1,014 సెంటర్లలో టీనేజర్లకు వ్యాక్సిన్ వేస్తున్నామని.. గ్రేటర్ హైదరాబాద్ సహా 12 మున్సిపల్ కార్పొరేషన్లలో స్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుక్ చేసుకున్న వారికి వ్యాక్సిన్ వేశామని, మిగిలిన ప్రాంతాల్లో నేరుగా వచ్చిన వారికి వ్యాక్సిన్ వేస్తున్నామన్నారు. గురువారం లేదా శుక్రవారం నుంచి కార్పొరేషన్లలోనూ అడ్వాన్స్ బుకింగ్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు, నేరుగా వచ్చిన వారికి కూడా వ్యాక్సిన్ వేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.

స్కూళ్లు, కాలేజీల్లో క్యాంపులు..

హైస్కూళ్లు, ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీల్లో వ్యాక్సిన్ క్యాంపులు పెట్టాలని హెల్త్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ భావిస్తోంది. 15–18 ఏండ్ల వయసు వాళ్లంతా స్కూళ్లు, కాలేజీల్లోనే ఉండే అవకాశం ఉండడంతో ఆ దిశగా ఆలోచిస్తున్నారు. ప్రైమరీ హెల్త్ సెంటర్, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల మెడికల్ ఆఫీసర్ల సమక్షంలో ఈ క్యాంపులు నడవనున్నాయి. పేరెంట్స్​ని ఒప్పించి, పిల్లలు వ్యాక్సిన్ వేసుకునేలా చూడాల్సిన బాధ్యతను టీచర్లు, లెక్చరర్లపై పెట్టనున్నారు. ప్రతి క్యాంపులో ముందుగా పిల్లలకు వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాభ, నష్టాలను వివరించి ఆ తర్వాతే వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభిస్తామని ఇమ్యునైజేషన్ ఆఫీసర్ ఒకరు తెలిపారు. కార్యక్రమంలో ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి పాల్గొన్నారు.