
- సీపీ సాయి చైతన్య
బాల్కొండ, వెలుగు: ఎన్నికల నిబంధనలు అనుసరించి పోలీస్ ఇమేజ్ పెంచేలా పని చేయాలని సీసీ సాయి చైతన్య అన్నారు. ఆదివారం కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసి మాట్లాడారు. గత ఎన్నికల్లో చెడుగా ప్రవర్తించిన వారిని గుర్తించి ముందస్తు బైండోవర్ చేయాలని, ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల బ్యారక్‌లు, ఫైల్స్ పరిశీలించి, కేసుల వివరాలు తెలుసుకున్నారు.
జిల్లా సరిహద్దులలో ప్రతి ఒక్కరిపై నిఘా పెట్టాలని, సిబ్బంది స్థానిక హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలన్నారు. ప్రతి ఆరు నెలలకు హెల్త్ చెకప్ చేయించుకోవాలని సూచించారు. భీంగల్ సీఐ సత్యనారాయణ, కమ్మర్ పల్లి ఎస్సై అనీల్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.