రక్తదానం జీవితంలో భాగం కావాలి : సీపీ సాయిచైతన్య

రక్తదానం జీవితంలో భాగం కావాలి : సీపీ సాయిచైతన్య
  • సీపీ సాయిచైతన్య 

నిజామాబాద్​, వెలుగు: ఆపత్కాలంలో ప్రాణాలు కాపాడే రక్తం దానం చేయడం ప్రజలు జీవితంలో భాగం చేసుకోవాలని సీపీ సాయిచైతన్య సూచించారు. సోమవారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 66వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో రక్తదానం శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. సోషల్​ సర్వీస్​లో పోలీస్​ శాఖను ఎప్పుడూ భాగస్వామ్యం చేస్తామన్నారు. ఆయిల్ కార్పొరేషన్​ ఆఫీసర్ పూర్ణచంద్రరావు, పోలీస్ వెల్ఫేర్​ ఇన్​స్పెక్టర్​ తిరుపతి, రెడ్​ క్రాస్​ చైర్మన్​ ఆంజనేయులు, మోహన్​కిషోర్​, అరుణ్​కుమార్ పాల్గొన్నారు.

పోలీస్​ ప్రజావాణిలో ఏడు ఫిర్యాదులు..

సీపీ ఆఫీస్​లో నిర్వహించిన పోలీస్​ ప్రజావాణిలో ఏడు ఫిర్యాదులు వచ్చాయి. సీపీ సాయి చైతన్య బాధితులను ఒక్కొక్కరిగా పిలిచి సమస్యలను తెలుసుకుని ఎస్సైలకు ఫోన్​ చేసి ఆదేశాలు జారీ చేశారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పౌరులు నేరుగా తనను కలువొచ్చని సీపీ స్పష్టం చేశారు.