రిమాండ్ ఖైదీ మృతిపై విచారణ జరిపించాలి

రిమాండ్ ఖైదీ మృతిపై విచారణ జరిపించాలి
  • వరంగల్​ జిల్లా నర్సంపేటలో దళిత సంఘాల ధర్నా

నర్సంపేట, వెలుగు: నర్సంపేట మహిళా​జైలులో రిమాండ్​ ఖైదీ పెండ్యాల సుచరిత మృతిపై హైకోర్టు సిట్టింగ్​ జడ్జితో  విచారణ జరిపించాలని డిమాండ్  చేస్తూ దళిత సంఘాల నాయకులు డిమాండ్​ చేశారు. ఆదివారం వరంగల్​ జిల్లా నర్సంపేటలో ఎమ్మార్పీఎస్​ ఆధ్వర్యంలో దళిత సంఘాల నాయకులు ధర్నా నిర్వహించి, అంబేద్కర్​ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా కళ్లెపల్లి ప్రణయ్​దీప్, ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షుడు తడుగుల విజయ్​ మాట్లాడుతూ ఓ కేసులో సుచరితను అరెస్ట్​ చేసి నర్సంపేట జైలుకు తరలించారని, ఈ నెల 21న ఆమె అనుమానాస్పదంగా జైలులో చనిపోయిందని పేర్కొన్నారు. 

ఆమెది సహజ మరణం కాదని, ముమ్మాటికీ హత్యేనని ఆరోపించారు. ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్​ జడ్జితో విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. సీసీ పుటేజీని పరిశీలించి బాధ్యులను గుర్తించాలని డిమాండ్​ చేశారు. మృతురాలి ఫ్యామిలీకి రూ.50 లక్షల ఎక్స్​గ్రేషియా చెల్లించాలని కోరారు. కొడారి రవి, యాకోబ్, నిరంజన్, ప్రభాకర్,  వినయ్. కుమార్. జాకీ పాల్గొన్నారు.