డేటా సెంటర్ల బిజినెస్​లో 81,247 కోట్ల పెట్టుబడులు

డేటా సెంటర్ల బిజినెస్​లో 81,247 కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీ దేశంలో డేటా సెంటర్ల బిజినెస్​లో రూ. 81,247 కోట్ల పెట్టుబడులు పెట్టారు. డేటా సెంటర్లకు డిమాండ్​ పెరగడంతో  2020 నుంచి ఈ పెట్టుబడులు వచ్చినట్లు కాలియర్స్​ ఇండియా రిపోర్టు వెల్లడించింది. 2025 నాటికి దేశంలోని డేటా సెంటర్లు   20 మిలియన్​ చదరపు అడుగులలో ఏర్పాటవుతాయని, అంటే ఏరియా రెట్టింపవుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం 10.3 మిలియన్​ చదరపు అడుగులలో డేటా సెంటర్లున్నాయి. ఇండియాలోని డేటా సెంటర్ల కెపాసిటీ ప్రస్తుతం 770 మెటగా వాట్స్‌. ప్రధానంగా ముంబై, ఢిల్లీ–ఎన్​సీఆర్​, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్​, పుణె, కోల్​కతాలలో డేటా సెంటర్లు ఏర్పాటవుతున్నాయని కూడా కాలియర్స్​ ఈ రిపోర్టులో తెలిపింది. 

డిజిటైజేషన్​, క్లౌడ్​ జోరు వల్లే.....

డిజిటైజేషన్​, క్లౌడ్​ వినియోగం బాగా పెరగడంతో డేటా సెంటర్ల బిజినెస్​కూడా విస్తరించినట్లు వివరించింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఇన్సెంటివ్స్​ కూడా డేటా సెంటర్​ ఆపరేటర్లను ఆకట్టుకుంటున్నట్లు వివరించింది. దీంతో ఈ బిజినెస్​ బాగా జోరందుకుంటోందని పేర్కొంది. తక్కువ ధరకే స్థలం, స్టాంప్​ డ్యూటీ మినహాయింపు వంటి సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. డేటా సెంటర్ల బిజినెస్​లో 49 శాతం వాటాతో ముంబై టాప్​ ప్లేస్​లో నిలుస్తోంది.  ల్యాండింగ్​స్టేషన్​, సబ్​మెరైన్​ కేబుల్​ కనెక్టివిటీ ముంబై సిటీకి ఈ విషయంలో కలిసొస్తున్నాయని కాలియర్స్​ వెల్లడించింది. 17 శాతం కెపాసిటీతో ఢిల్లీ రెండో ప్లేస్​లో నిలుస్తోంది. ఆ తర్వాత ప్లేస్​లో బెంగళూరు ఉందని పేర్కొంది. 2020 నుంచి ఇప్పటిదాకా డేటా సెంటర్ల బిజినెస్  ​మొత్తం రూ. 81,247 కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్లు కాలియర్స్​ తెలిపింది. డెవలపర్లు, గ్లోబల్​ ఆపరేటర్ల మధ్య పార్ట​నర్షిప్​లు కూడా జోరందుకుంటున్నాయని వివరించింది. డేటా సెంటర్​ బిజినెస్​లో గ్లోబల్​డేటా సెంటర్ ఆపరేటర్లు, కార్పొరేట్లు, రియల్​ఎస్టేట్​ డెవలపర్లు, ప్రైవేట్​ ఈక్విటీ ఫండ్​లు పెట్టుబడులు పెడుతున్నట్లు ఈ రిపోర్టు పేర్కొంది. 

డేటా సెంటర్ల ఏర్పాటుకు భారీ పెట్టుబడులు అవసరమవుతాయి. దీంతో లాంగ్​ టర్మ్​ లో తట్టుకోగలిగే వాళ్లే డేటా సెంటర్ల బిజినెస్​లో అడుగుపెడుతున్నారు. డేటా సెంటర్ల ఏర్పాటులో రియల్​ ఎస్టేట్​ ఖర్చు 25 శాతమే. ఈ రంగంలో డెవలపర్లు, ఇన్వెస్టర్లకు చాలా చక్కని అవకాశాలున్నాయి.  దేశంలోని డేటా సెంటర్లలో 22 శాతం డేటా సెంటర్లకు మాత్రమే లీడ్​ సర్టిఫికేషన్​ ఉంది. డేటా సెంటర్ల ఏర్పాటుకు మెట్రో సిటీలే హబ్​లుగా నిలుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కొంత మంది డేటా సెంటర్​ ఆపరేటర్లు విజయవాడ, నాగ్​పూర్​, రాయ్​పూర్​, కోచ్చి, పాట్నా, మంగళూరు వంటి  సిటీల వైపు చూస్తున్నారు. 

‑ రమేష్​ నాయర్​, సీఈఓ, 
కాలియర్స్​ ఇండియా