వజిర్ఎక్స్ క్రిప్టో ఎక్స్ఛేంజీ కేసులో బాంబేహైకోర్టు కీలక తీర్పు.. కాయిన్ స్విచ్ సంస్థకు ఊరట..

వజిర్ఎక్స్ క్రిప్టో ఎక్స్ఛేంజీ కేసులో బాంబేహైకోర్టు కీలక తీర్పు.. కాయిన్ స్విచ్ సంస్థకు ఊరట..

ప్రముఖ భారతీయ క్రిప్టో ఎక్స్ఛేంజీ వజిర్ఎక్స్ వాలెట్ల నుంచి 2024లో సైబర్ నేరగాళ్లు 234 మిలియన్ డాలర్ల క్రిప్టోలను తస్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన కేసులో బాంబే హైకోర్టు కాయిన్ స్విచ్ సంస్థకు మద్ధతుగా తీర్పు వెలువరించింది. పైగా కాయిన్ స్విచ్ సంస్థకు సంబంధించిన రూ.62 కోట్ల నిధులు కూడా దీనిలో ముడిపడ్డాయి. వజిర్ఎక్స్ సంస్థ ప్రస్తుతం పూర్తిగా జనమై ల్యాబ్స్ ఆధీనంలో ఉండటంతో ఈ డబ్బుకు పూర్తి బాధ్యత ఆ సంస్థదేనని కోర్టు పేర్కొంది. వజిర్ఎక్స్ నుంచి కాయిన్ స్విచ్ తన ఆస్తులను తిరిగిపొందటానికి బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం కీలకంగా మారింది. 

ప్రస్తుతం వజిర్ఎక్స్ సంస్థ ఈఆర్సీ20 టోకెన్లు వాలెట్ల నుంచి దొంగిలించబడిన కేసుపై బాంబే హైకోర్టు తీర్పు భారత వర్చువల్ డిజిటల్ అసెట్స్ రంగానికి కీలక మార్గదర్శిగా నిలుస్తోంది. కస్టమర్ల డబ్బు పవిత్రమైనదని ఒకరు చేసిన తప్పుల వల్ల కస్టమర్ల నష్టాల భర్తీకి కుదరదనిప చెప్పింది కోర్టు. కలిగిన నష్టాన్ని అందరు కస్టమర్లకు పంచేందుకు సింగపూర్ ఆధారంగా చేసిన ప్రణాళికను కోర్టు నిరాకరించటం ఇక్కడ కస్టమర్ల పెట్టుబడులకు అత్యుత్తమ ప్రాధాన్యతను ఇవ్వటమే. అలాగే కస్టడీలో ఉంచిన ఆస్తులు వినియోగదారుల సమ్మతి లేకుండా వినియోగించటం లేదా బదిలీ చేయటాన్ని కోర్టు నిరాకరించింది.

ఇదంతా చూస్తుంటే ప్రస్తుతం క్రిప్టోలు ఒక పెట్టుబడి రూపం దాల్చుకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లకు క్రిప్టో ఎక్స్ఛేంజీలపై నమ్మకంతో పాటు వాటి భద్రతపై అనుమానాలు కలుగుతున్నాయి. కోర్టు తీర్పు ప్రస్తుతం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న జియోటస్ లాంటి క్రిప్టో ఎక్స్ఛేంజీలకు విధానాన్ని బలోపేతం చేస్తోందని సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ అన్నారు. కంపెనీలు తమ క్లయింట్ల సొమ్మును బ్యాలెన్స్ షీట్లలో తమదిగా భావించటం ముమ్మాటికీ తప్పేనన్నారు సుబ్బురాజ్. ఇలాంటి చర్యలు కస్టమర్లలో నమ్మకాన్ని తగ్గిస్తుందని చెప్పారు.\

►ALSO READ | Dhanteras 2025: రేటు పెరిగినా బంగారం బంగారమే.. ధనత్రయోదశికి వ్యాపారులు ఆఫర్ల వర్షం..

తాజా తీర్పు క్రిప్టో పరిశ్రమలో కస్టడీ, నియంత్రణ, అంగీకారం వంటి కీలక అంశాలపై కొత్త చట్టాలను నియంత్రణలను తీసుకొచ్చింది. ఇక్కడ సర్వీస్ అలాగే ఆస్థి బాధ్యతల మధ్య ఉన్న తేడాను విశదీకరిస్తూ గీత గీసింది న్యాయస్థానం. రీకన్ స్ట్రక్షన్ ముసుగులో ఏకపక్షంగా చర్యలు చేపట్టడాన్ని కోర్టు పూర్తిగా తిరస్కరించింది. కోర్టు తీర్పు క్రిప్టోల కస్టడీ గురించి పరిగణించింది. అలాగే సైబర్ దాడి తర్వాత తాత్కాలికంగా సేవలు నిలిపివేత అలాగే యాజమాన్య హక్కుల కోల్పోవటం గురించి కూడా స్పష్టతను ఇచ్చింది కోర్టు తీర్పు.  

క్రిప్టోల ఆడిట్ అలాగే స్టోరేజ్ గురించి కస్టోడియల్ ఫ్లేమ్ వర్క్ కి సంబంధించిన సూక్ష్మమైన నియంత్రణవైపు భారత్ కదులుతోందని కోర్టు తీర్పు చెప్పకనే చెబుతోంది. కోర్టు తీర్పు సంస్థాగత లోపాల నుండి పెట్టుబడిదారులను రక్షించే ప్రపంచ ఉత్తమ పద్ధతులను ప్రతిబింబిస్తోంది. బాంబే హైకోర్టు తీర్పుతో భారత న్యాయవ్యవస్థలు న్యాయంగా జవాబుదారీతనాన్ని సమర్థిస్తాయని పెట్టుబడిదారులకు సూచనను ఇస్తోంది. డిజిటల్ యుగంలో వస్తున్న మార్పుల పూర్తి క్రిప్టో ఎకోసిస్టంపై నమ్మకాన్ని పెంచేవిధంగా కోర్టు తీర్పు ఉందని జియోటస్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ అభిప్రాయపడ్డారు. అందుకే యూజర్లు అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు, జవాబుదారీతనం పాటించే క్రిప్టో ఎక్స్ఛేంజీలనే ఎంచుకోవాలని సూచించారు.