Dhanteras 2025: రేటు పెరిగినా బంగారం బంగారమే.. ధనత్రయోదశికి వ్యాపారులు ఆఫర్ల వర్షం..

Dhanteras 2025: రేటు పెరిగినా బంగారం బంగారమే.. ధనత్రయోదశికి వ్యాపారులు ఆఫర్ల వర్షం..

బంగారం కొనుగోలుకు శుభప్రదమైన రోజుల్లో ధనత్రయోదశి ఒకటి. అందుకే ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తుంటారు వ్యాపారులు ఈ సమయంలో. ఈ ఏడాది ధనత్రయోదశి దీపావళికి కొద్దిరోజుల ముందు అక్టోబర్ 18న వస్తున్న నేపథ్యంలో వ్యాపారులు ఆఫర్లతో కస్టమర్లకు స్వాగతం పలుకుతున్నారు. మరి ఈ ఏడాది బంగారం రేటు అంచనాలను మించి దూసుకుపోవటంతో పుత్తడి ప్రియులకు షాక్ ఇస్తోంది. అయినా గ్రాము బంగారమైనా కొనాలనే కోరికతో ఉన్నారు చాలామంది భారతీయులు.

నార్త్ ఇండియాలో 'ధన్ తేరస్'గా పిలిచే ధనత్రయోదశి కొన్నేళ్లుగా తెలుగు పండుగలో ఒకటైంది. ఉత్తరాది వైపు ధన్ తేరసి రోజు బంగారం కొనడం సెంటి మెంట్. పురాణాల ప్రకారం- రెండు, మూడు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ధనత్రయోదశి రోజు లక్ష్మి దేవిని బంగారంతో పూజిస్తే ఆష్టైశ్వర్యా లతో తులతూగుతారని నమ్మకం. దీంతో ఎంతో కొంతే బంగారం కొవడం అనవాయితీగా వస్తోంది.
'ధనత్రయోదశి, అక్షయ తృతీయ పండుగలు ఉత్తరాదికి చెందినవే అయినా.. తెలుగు రాష్ట్రాల్లో సేల్స్ ఆశాజనకంగా సాగుతాయి. ఈ శనివారం 'ధన త్రయోదశి' కావడంతో ఆఫర్లను భారీగా ప్రకటిస్తున్నాయి జ్యువెలరీ షాపులు. 

ALSO READ : ర్యాలీ ఆపని గోల్డ్, సిల్వర్.. మానవ చరిత్రలోనే గరిష్టాలకు రేట్లు..

కొన్నేళ్లుగా బంగారం మీద బంగారం లాంటి ఆఫర్స్ అందిస్తున్నాయి. పండుగ రోజు షాపింగ్ కష్టం కాబట్టి ఫ్రీ బుకింగ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు వ్యాపారులు. పండుగ పూట ఎక్కడైనా కొనడం మంచిదేగా అంటున్నారు పుత్తడి ప్రియులు. ఎన్ని ఉన్నా ఇందా కొనాలనే ఉంటుంని చెబున్నారు మహిళలు. మంచి జరుగుతుంది కాబట్టి కొంటే తప్పేముంటుందంటున్నారు. ధర ఎక్కువైనా పర్లేదు. సెంటి మెంట్ ముఖ్యం అంటున్నారు చాలామంది. దీనికి తోడు క్విక్ కామర్స్ ఫ్లాట్ ఫారమ్ సంస్థలు కూడా ఇంటికే గోల్డ్ కాయిన్స్ డెలివరీలు ఆఫర్ చేస్తుండటంతో వినియోగదారులకు వెసులుబాటు మరింతగా పెరిగిపోయింది. కానీ డెలివరీ సమయంలో వచ్చింది 22 క్యారెట్లా లేక 24 క్యారెట్లా అనేది సరిచూసుకోవటం ముఖ్యం. 

అసలే ఇప్పటికే బంగారం రేటు ఏడాది కాలంలోనే 50 శాతం వరకు పెరగటంతో చాలా మంది భారంగా భావిస్తున్నారు. అందుకే షాపుల యజమానులు కూడా కస్టమర్లను ఆకట్టుకునేందుకు.. మేకింగ్, వేస్టేజీలో తగ్గింపులను ఆఫర్ చేస్తున్నారు. ఆభరణాల కొనుగోలుపై మిక్సీ, కుక్కర్, వాషింగ్ మిషన్, ఫ్రిజ్ వంటి వస్తువులను బహుమతులుగా దిస్తున్నారు. షాపింగ్ చేసిన నగల రేటును బట్టి మంచి గిఫ్టులను అందిస్తున్నాయి కొన్ని గోల్డ్ షాప్స్. 

పెళ్లిళ్ల సీజన్ కూడా కలిసే రావడంతో రేటు ఎక్కువైనా అమ్మణాలు బాగుంటాయంటున్నారు. వ్యాపారులు "సెంటిమెంట్- పెళ్లిళ్లు, ఆఫర్లు... వీటి కారణంగా పెరిగిన ధరలను ప్రభావితం చేయవు. ప్రస్తుతానికైతే... ప్రీ బుక్వింగ్ ఎక్కువగానే కొనసాగుతున్నట్లు బులియన్ మర్చంట్స్ చెబుతున్నారు. బంగారం ధరలు పెరిగినా బంగారం బంగారమే' అంటున్నారు కస్టమర్లు. రేట్లు అధిక స్థాయిల్లో ఉండటంతో గతంతో పోల్చితే ఈ ఏడాది కొంత సేల్స్ తగ్గే అవకాశం ఉందని అంటున్నారు కొందరు వ్యాపారులు. కానీ ఎంత మేరకు సేల్స్ తగ్గుతాయనేది ధనత్రయోదశి తర్వేతే వెల్లడికానుంది. 

వ్యాపారులు ఆఫర్స్ ఇస్తున్నారు. కదా.. అని గుడ్డిగా ముందుకు పోకుండా ఆఫర్స్‌ను పరిశీలించి కొనుగోలు చేయాలంటున్నారు నిపుణులు. వ్యాపారి ఎప్పుడూ సష్టంతో బిజినెస్ చేయడు కాబట్టి ఆఫర్స్ సరైనవా కాదా అని ఆలోచించుకో వాలని సూచిస్తున్నారు. కొందరు ఫ్రీ అంటూనే.. రెగ్యులర్ తగ్గించే వెస్టీజ్ ను తగ్గించరు. అందుకని వేసైజ్. మేకింగ్.. ఆఫర్ ను కలిపి భేరీజు వేసుకోవాలంటున్నారు. ఈ ఏడాది ధరలు పుత్తడి ప్రియులకు ఆశాజనకంగా లేవనే చెప్పాలి.