నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి : డీసీపీ రాజ మహేంద్ర నాయక్

నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి : డీసీపీ రాజ మహేంద్ర నాయక్

జనగామ అర్బన్, వెలుగు: వినాయక నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని వెస్ట్​ జోన్​ డీసీపీ రాజ మహేంద్ర నాయక్​ భక్తులకు సూచించారు. బుధవారం పట్టణంలోని జ్యోతినగర్ కాలనీ లో జై హనుమాన్​ యూత్​ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో డీసీపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

యువత భక్తి మార్గంలో నడిస్తే మెరుగైన సమాజ నిర్మాణం జరుగుతుందన్నారు. వేడుకల్లో భాగంగా మండపం వద్ద ఏర్పాటు చేసిన హహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం అసోసియేషన్​ ప్రెసిడెంట్​బాల్దె దేవేందర్ డీసీపీని సన్మానించి జ్ఞాపికను అందజేశారు.