అమెరికా ఆయుధ కర్మాగారంలో పేలుడు.. కూలిన 8 ఫ్లోర్ల బిల్డింగ్.. భారీగా మృతులు

అమెరికా ఆయుధ కర్మాగారంలో పేలుడు.. కూలిన 8 ఫ్లోర్ల బిల్డింగ్.. భారీగా మృతులు

మెక్​ఎవెన్ (యూఎస్): అమెరికాలోని టెనస్సీ మిలటరీ ఆయుధ కర్మాగారంలో శుక్రవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. భారీ ఎత్తున మంటలు వ్యాపించడంతో మరికొందరి ఆచూకీ తెలియడం లేదని ప్రకటించారు. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది.. సహాయక చర్యలు చేపట్టారు. బక్స్​నార్ట్ సిటీకి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఈ ఆయుధ కర్మాగారం కొండ ప్రాంతంలో ఉంది. 

8 ఫ్లోర్ల బిల్డింగ్​లో పేలుడు సంభవించిందని హిక్మాన్ కౌంటీ షెరీఫ్ ఆఫీస్ వెల్లడించింది. కొన్ని కిలో మీటర్ల దూరం వరకు పేలుడు శబ్ధం వినిపించింది. అక్యూరేట్ ఎనర్జీ సిస్టమ్స్​లో ఈ బ్లాస్ట్ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. పేలుడు పదార్థాలు తయారు చేసి ఇక్కడే టెస్ట్ చేస్తుంటారు. ఎంత మంది చనిపోయారో తెలియడం లేదని అధికారులు తెలిపారు.