కవిత అరెస్ట్.. రేపు ఈడీ ముందుకు కేజ్రీవాల్‌

కవిత అరెస్ట్..  రేపు ఈడీ ముందుకు కేజ్రీవాల్‌

లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ కావడంతో  తరువాత ఈడీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయనుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈడీ పలుమార్లు ఆయనకు నోటీసులు పంపిన ఆయన వాటిని పట్టించుకోలేదు.  ఈడీ సమన్లపై స్టే విధించాలన్న ఆయన విజ్ఞప్తిని రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. దీంతో కేజ్రీవాల్ రేపు ఈడీ విచారణకు తప్పక హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఈసారి ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ కింద ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది.  కాగా ఇప్పటివరకు ఈడీ కేజ్రీవాల్‌కు ఎనిమిది సార్లు సమన్లు ఇచ్చింది.

ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో  ఆమె ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. భారీగా బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, మహిళలు కవిత ఇంటి వద్దకు చేరుకున్నారు. కవిత అరెస్ట్‌కు వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కవిత ఇంటి దగ్గర కేంద్ర బలగాలు మోహరించాయి. ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ.. ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లేందుకు పూర్తి ఏర్పాట్లు చేసింది. ఇవాళ రాత్రికి కవితను ఫ్లైట్‌లో హస్తినకు తరలించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం న్యాయవాదులతో కలిసి కేటీఆర్, హరీశ్ రావు కూడా ఢిల్లీ వెళ్తారని సమాచారం.