దేశాన్ని కుదిపేస్తున్న రియల్ స్టోరీ : ఫోరెన్సిక్ స్టూడెంట్ థ్రిల్లింగ్ క్రైం మర్డర్..

 దేశాన్ని కుదిపేస్తున్న రియల్ స్టోరీ : ఫోరెన్సిక్ స్టూడెంట్ థ్రిల్లింగ్ క్రైం మర్డర్..

పరిచయంతో మొదలైన ప్రేమ, ప్రైవేట్ వీడియోల రికార్డింగ్, తరువాత మాజీ ప్రియుడి ఎంట్రీతో  కుట్ర.. చివరకు ఓ యువకుడి హత్యకు దారితీసింది. ఢిల్లీలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలు తాజాగా పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో యువతితో పాటు ఆమె  మాజీ ప్రియుడు, మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసుల వివరాల కథనం ప్రకారం మే నెలలో రామ్‌కేష్ మీనా (32), అమృతా చౌహాన్ (21) నోయిడాలో ఓ జాబ్ ఇంటర్వ్యూలో కలుసుకున్నారు. మొదటిసారే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి నంబర్లు మార్చుకొని తరువాత చాటింగ్,  ప్రేమ, చివరికి ఢిల్లీలో ఒక ఫ్లాట్‌ రెంట్ తీసుకొని  కలిసి జీవించడం మొదలుపెట్టారు. అప్పుడే వారి సన్నిహిత క్షణాల వీడియోలు రికార్డ్  చేసుకున్నారు. ఆ వీడియోలే చివరికి ఇంతటి దారుణానికి కారణమయ్యాయి.

సెప్టెంబర్ మొదట్లో  గ్యాస్ సిలిండర్ డిస్ట్రిబ్యూటర్ అయిన అమృత మాజీ ప్రియుడు సుమిత్ కశ్యప్ ఆమె జీవితంలోకి మళ్ళీ వచ్చాడు. మొరాదాబాద్‌కు చెందిన వీళ్లిద్దరు  గతంలో విడిపోయి మళ్లీ దగ్గరయ్యారు. సుమిత్ కశ్యప్ అమృత జీవితంలోకి మళ్ళీ రావడంతో రామ్‌కేష్ ఒంటరిగా మారాడు. అయితే అమృత  సెప్టెంబర్ 8 నుండి అక్టోబర్ 1 వరకు సోషల్ మీడియాలో బాలీవుడ్ పాటలకు లిప్‌సింక్ చేస్తూ డజన్ల కొద్దీ 'రీల్స్' పోస్ట్ చేయడం గమనార్హం.

సుమిత్ కశ్యప్ వల్ల దూరమవుతున్న అమృతకి దగ్గర అయ్యేందుకు రామ్‌కేష్ ఎంతో  ప్రయత్నించాడు. వారి పాత సన్నిహిత వీడియో క్లిప్‌లు ఆమెకు పంపుతూ బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడని పోలీసులు తెలిపారు. దీంతో ఆగ్రహించిన అమృత, ఆ క్లిప్‌లు ఉన్న హార్డ్ డిస్క్‌ను డిలేట్ చేసేందుకు తనకు ఇవ్వాలని బెదిరించింది. రామ్‌కేష్ అందుకు నిరాకరించడంతో, ఆమె పగతో ప్లాన్ వేసింది. ఈ సమయంలోనే అమృత ఛతర్‌పూర్‌లోని అద్దె ఇంట్లో సుమిత్‌తో కలిసి ఉండటం మొదలుపెట్టింది.

అమృత, సుమిత్ కలిసి సుమిత్ స్నేహితుడు సందీప్ కుమార్‌ను కలిశారు. హార్డ్ డిస్క్‌ను దొంగతనం చేయడానికి రామ్‌కేష్ ఇంట్లో దోపిడీ చేయాలనేది వారి ప్లాన్ అని పోలీసులు తెలిపారు. 6 అక్టోబర్ రోజున రాత్రి ముసుగు ధరించిన సుమిత్, సందీప్ కలిసి మొదట రామ్‌కేష్ ఇంట్లోకి చొరబడ్డారు. రామ్‌కేష్‌ను పట్టుకుని హార్డ్ డిస్క్ ఎక్కడుందో చెప్పాలని బలవంతం చేస్తూ గొడవలో గొంతు నులిమి చంపేశారు. రామ్‌కేష్‌ చనిపోవడంతో వారి ప్రయత్నం విఫలమైంది.

రామ్‌కేష్ చనిపోయాడని గ్రహించిన ముగ్గురూ హత్యను ప్రమాదంగా మార్చి తప్పించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫోరెన్సిక్ సైన్స్‌ స్టూడెంట్ అయిన అమృత కొన్ని ఐడియాలు ఇవ్వగా, గ్యాస్ సిలిండర్ల డిస్ట్రిబ్యూటర్ అయినా  సుమిత్ తన తెలివిని ఉపయోగించాడు.
చివరికి రామ్‌కేష్ శరీరంపై నెయ్యి, నూనె, వైన్ పోసి గ్యాస్ సిలిండర్  ఆన్ చేసి లైటర్‌తో నిప్పంటించారు. తరువాత గేటుకు లోపలి నుంచి లాక్ వేసి అక్కడి  నుండి పారిపోయారు.

కొద్దిసేపటికే సిలిండర్ పేలి పెద్ద మంటలు చెలరేగాయి. దీంతో రామ్‌కేష్ శరీరం పూర్తిగా కాలిపోయింది. మొదట పోలీసులు ఏసీ పేలుడు వల్ల ప్రమాదం జరిగిందని అనుకున్నారు. కానీ హత్య తర్వాత నిందితులు మాస్కులు ధరించి ఇంటి నుండి బయటికి వెళ్తున్న దృశ్యాలు, మొబైల్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేసి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ముగ్గురు జైల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.