తమిళ సినిమాల్లో తమిళ నటులకే ఛాన్స్ ఇవ్వాలి..ప‌వ‌న్కి కౌంట‌ర్గా ఆర్కే సెల్వ‌మ‌ణి?

తమిళ సినిమాల్లో తమిళ నటులకే ఛాన్స్ ఇవ్వాలి..ప‌వ‌న్కి కౌంట‌ర్గా ఆర్కే సెల్వ‌మ‌ణి?

ఏపీ మినిస్టర్ రోజా భర్త..ద‌క్షిణా భార‌త సినీ కార్మికులు స‌మాఖ్య‌(Pepsi) అధ్య‌క్షుడు..ఆర్కే సెల్వ‌మ‌ణి(Rk Selvamani). తమిళ డైరెక్టర్ అయినా సెల్వమణి మరోసారి సినిమా పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాన్ ఇండియా అంటూ..తమిళ సినిమాలు తమ ఉనికిని కోల్పోతున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా..తమిళ సినిమాల్లో తమిళ యాక్టర్స్కు..తమిళ టెక్నీషియన్స్కు మాత్రమే అవకాశాలు ఇవ్వాలంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఇతర భాషల నటుల్ని తీసుకోవడం వల్ల తమిళ సంప్రదాయాలు, భాషలు ఏ మాత్రం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇక రీసెంట్గా.. బ్రో ప్రీరిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్(Pawankalyan) స్థానికత గురుంచి స్పందించిన విషయం తెలిసిందే. సినిమా కేవలం వినోదం మాత్రమేనని..స్థానికేతర భేదాలు చూడొద్దని తెలిపారు. అలా అనుకొనే, బ్రో సినిమాని పలు భాషల నటులతో తెరకెక్కించాము. అంతేకానీ, క‌ళా కారుల్ని ఒక ప్రాంతానికి..మ‌తానికి...కులానికి ప‌రిమితం చేయోద్ద‌ని..పవన్ సూచించారు. 

ఇప్పుడు పవన్ వ్యాఖ్య‌ల్ని దృష్టిలో ఉంచుకుని సెల్వమణి స్పందించినట్లు తెలుస్తోంది. అలాగే ఏపీలో పాలిటిక్స్ ఎంత వేడిగా సాగుతున్నాయో అందరికీ తెలిసిందే. ఇలాంటి టైములో ఏపీ మినిస్టర్ రోజా భర్త సెల్వమణి ఈ వ్యాఖ్యలు చేయడంతో..రాజకీయా రంగు ఏమైనా ఉందా అని.. అటూ ఇండస్ట్రీలో, మరో పక్క రాజకీయా నాయకుల్లో చర్చ జరుగుతుంది. ఇక సెల్వమణి నిర్ణయాన్ని..తెలుగు,కన్నడ, మలయాళ ఇండస్ట్రీలు వ్యతిరేకించారు. అయినా, తన మాటలకు కట్టుబడి ఉన్నట్లు సెల్వమణి వెల్లడించారు.