
గజ్వేల్, వెలుగు: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్వో డాక్టర్ధనరాజ్వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం గజ్వేల్ లోని బస్తీ దవాఖాన, పాలేటివ్ కేర్ యూనిట్, గజ్వేల్ ఆస్పత్రిలో ఎంపీహెచ్ఎఎఫ్ అభ్యర్థులకు నిర్వహిస్తున్న ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణను డిప్యూటీ డీఎంహెచ్ఓ లు శ్రీనివాస్, రేవతి తో కలిసి పర్యవేక్షించారు. 11న నిర్వహించే జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
బస్తీ దవాఖాన సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న ఆరోగ్య కార్యక్రమాల పనితీరును, రికార్డులను పరిశీలించారు. మాతా శిశు సంక్షేమ కార్యక్రమాల పనితీరును మెరుగుపరుచుకోవాలని, గర్భిణీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, బర్త్ ప్లానింగ్ ఆధారంగా ప్రసవాలు జరిగేటట్లు పెంచుకోవాలని, ఉద్యోగులు సమయపాలన పాటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ లు శ్రీనివాస్, రేవతి, తులసి, డాక్టర్లు గీత, పల్లవి, సీహెచ్ఓ రవీందర్ రెడ్డి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.