
మరిపెడ, వెలుగు : రక్త దానం మరొకరికి ప్రాణ దానమని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ అన్నారు. మంగళవారం మరిపెడ పీహెచ్ సీలో స్వస్త్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్లో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా, ఎమ్మెల్సీ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు.
ప్రతి ఒక్కరూ రక్త దానం చేసి ఇతరులకు సాయపడాలని కోరారు. కార్యక్రమంలో డీఎంహెచ్ వో రవి రాథోడ్, డిప్యూటీ డీఎం హెచ్ వో సుధీర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నేత యుగంధర్ రెడ్డి, తాజ్ దీన్, మండల్ మెడికల్ ఆఫీసర్ రవి, వైద్య సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సర్టిఫికెట్ను అందజేస్తున్న ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్