అత్యవసర మందుల డెలివరీకి డ్రోన్లు

అత్యవసర మందుల డెలివరీకి డ్రోన్లు
  • ప్రయోగాత్మకంగా ఎక్స్ ప్రెస్ కన్సార్టియంను ఏర్పాటు చేసిన బ్లూ డార్ట్

కరోనా మహమ్మారి కంటికి కనిపించకుండా సునామీలా విరుచుకుపడుతున్న ప్రస్తుత తరుణంలో మందులు అత్యవసరమైన పరిస్థితుల్లో ఏ మాత్రం జాప్యం జరిగినా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎక్కడో ఒకచోట రోజూ చూస్తూనే ఉన్నాం.. వింటూనే ఉన్నాం. అత్యవసర సమయాల్లో అనవసర జాప్యాన్ని నివారించేందుకు ఏం చేయాలన్న ఆలోచనల నుంచే డ్రోన్ ల ద్వారా డెలివరీ ఆలోచన పుట్టుకువచ్చినట్లుంది. దేశంలోని అగ్రగామి ఎక్స్ ప్రెస్ లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన బ్లూ డార్ట్ మారుమూల ప్రాంతాలకు డ్రోన్లతో టీకాలు,  మందులు, అత్యవసర వైద్య పరికరాలను అందించడానికి బ్లూ డార్ట్ మెడ్ – ఎక్స్ ప్రెస్ కన్సార్టి యంను ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా బ్లూ డార్ట్   మేనేజింగ్ డైరెక్టర్ బాల్ ఫోర్ మాన్యుయెల్, సీఎంఓ, బిజినెస్ డెవలప్ మెంట్ హెడ్ కేతన్ కులకర్ణి లు మాట్లాడుతూ టీకాలను డెలివరీ చేయడం ఈ కన్సార్టియం లక్ష్యం అని, కంటిచూపు పరిధికి మించిన ఎత్తులో డ్రోన్లు ప్రయాణిస్తాయని, యావత్ ప్రజాజీవనం స్తంభించిపోకుండా డ్రోన్లు ఉపయోగపడతాయన్నారు. కోవిడ్ -19 టెస్టింగ్ కిట్స్, వెంటిలేటర్లు, పీపీలు, టెస్టింగ్ కిట్స్, రీగెంట్స్, ఎంజైమ్స్, రెసిపిరేటర్లు, సర్జికల్ మాస్క్ లు, గాగుల్స్, గ్లోవ్స్ లాంటి ఇతర ముఖ్య మైన వస్తువులు అత్యవసర ప్రాంతాలకు సరఫరాలో ఉపయోగపడతాయని వారు తెలిపారు.