ఏపీలో అకాల వర్షాలు పడే అవకాశం

ఏపీలో అకాల వర్షాలు పడే అవకాశం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం కారణంగా తమిళనాడులోని నాగపట్నం నుంచి 320 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది . 13 కి.మీల వేగంతో వాయుగుండం ఉత్తర దిశగా కదులుతుందని తెలిపారు. సాయంత్రం తమిళనాడు తీరానికి మరింత దగ్గరగా వాయుగుండం వచ్చే అవకాశం ఉందని తెలియజేసింది. దీంతో తమిళనాడు, కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని, తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

మరిన్ని వార్తల కోసం

లండన్ నుంచి భారత్కు.. సద్గురు బైక్ యాత్ర
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్ డేట్స్