చేపలు తింటే ఎంతో మేలు

చేపలు తింటే ఎంతో మేలు

మృగశిర  కార్తె మొదటి రోజు చేపలకు గిరాకి పెరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ రోజు చేపలు తినాలనుకుంటారు. మృగశిరలో చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదంటారు. అసలు ఆరోగ్యానికి, చేపలకు, మృగశిర కార్తెకు ఉన్న సంబంధం ఏమిటంటే...మృగశిర కార్తె రాగానే వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. దీంతో మన శరీరంలోనూ అలాంటి మార్పులే కనిపిస్తాయి. దాంతో చాలామంది పలు  రకాల జబ్బుల బారిన పడతారు.  హార్ట్​ డిసీజెస్​, ఆస్తమా ఉన్నవాళ్లు, గర్భిణులు చేపలు తింటే చాలా మంచిది. ఫిష్​లో ఆరోగ్యాన్ని పెంచే  పోషకాలు చాలా ఉంటాయి. అంతేకాదు ఫిష్ ఈజీగా జీర్ణం అవుతుంది కూడా.  - డా. హరినారాయణ, జనరల్​ ఫిజీషీయన్​.

మృగశిర కార్తె 15 రోజులు ఉంటుంది. ఎండాకాలం తర్వాత తొలకరి వానలకు వాతావరణం చల్లబడి బాడీలో వేడి​ తగ్గుతుంది. అందుకే శరీరాన్ని వేడిగా ఉంచేందుకు చేపలు తింటారు.  ఈ సీజన్‌‌లో చాలా మందికి డైజెషన్​ సరిగా ఉండదు. ఇమ్యూనిటీ పవర్​ తగ్గుతుంది. అలాగే జ్వరం, దగ్గు వంటివి కూడా వస్తాయి. వీటి నుంచి దూరంగా ఉండేందుకు చేపలు తింటారు. ఈ కరోనా టైంలో ఇమ్యూనిటీ పెంచుకునేందుకు లోకల్​గా దొరికే  పెద్ద చేపలను చింత చిగురుతో వండుకొని తినాలని డాక్టర్లు చెబుతున్నారు. మృగశిర కార్తె తొలి రోజున ఏ ఇంట చూసినా చేపల కూర రుచులు నోరూరిస్తాయి. ఎప్పుడూ ఫిష్​ తినని వాళ్లు కూడా పులుసు లేదా ఫ్రై చేసుకొని  రెండు చేప ముక్కలు నోట్లో వేసుకుంటారు. ఇక చేపలు నచ్చని వాళ్లు రొయ్యలు, ఎండ్రకాయలతో పులుసు చేసుకుంటారు. కొందరైతే ఎండబెట్టిన చేపల వరుగులను చింత చిగురుతో కలిపి వండుకుంటారు. 
పోషకాలు ఫుల్​!
ఫిష్​లో క్యాల్షియం, పాస్ఫరస్, ఐరన్‌‌, కాపర్‌‌, మెగ్నీషియం, జింక్‌‌ వంటి న్యూట్రియెంట్స్​ పుష్కలంగా లభిస్తాయి.  రుచిని పెంచే లైసిన్‌‌, మిథియోనిన్‌‌, ఐసోల్యూసిన్‌‌ వంటి అమైనో ఆమ్లాలు దొరుకుతాయి. చేప కొవ్వు ఈజీగా అరిగి శక్తి వస్తుంది. చేపల్లో ఉన్న  కొలెస్ట్రాల్‌‌, ట్రై గ్లిసరైడ్స్‌‌ బీపీని కంట్రోల్​లో ఉంచుతాయి. ఒమెగా–3 కొవ్వు ఆమ్లాలలోని డీహెచ్‌‌ఏ (డై హైడ్రాక్సీ అసిటోన్​), ఈపీఏ (ఇకోసపెంటనోయిక్​ యాసిడ్​)  వంటివి కంటి చూపును, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. సముద్ర చేపల కాలేయంలో (కాడ్‌‌ చేప)  ఎ, డి, ఇ వంటి ఫ్యాట్​ సాల్యుబుల్ విటమిన్స్‌‌ ఎక్కువగా ఉంటాయి. చేపలలో పాలీ అన్​శాచ్యురేటెడ్​ ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువ. అందుకే  గుండె సంబంధిత వ్యాధులు, ఆస్తమా, మధుమేహం ఉన్నవాళ్లని చేపలు తినమని చెబుతారు డాక్టర్లు. గర్భిణులు చేపలు తింటే ఇమ్యూనిటీతో పాటు, పిల్లల నాడీ వ్యవస్థ డెవలప్​ అవుతుంది. చంటి పిల్లల తల్లులకు పాలు బాగా వస్తాయి.                                                  ::: అజ్మీరా డాకు నాయక్​, మహాముత్తారం