
హైదరాబాద్, వెలుగు: ఇంటర్‌స్టేట్ గంజాయి స్మగర్లపై నిఘా పెట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌డైరెక్టరేట్(ఈడీ) ముగ్గురిని అరెస్ట్ చేసి రూ.12 కోట్ల విలువైన గంజాయి సీజ్చేసింది. అంబర్‌పేట్ ఓఆర్‌ఆర్‌పై శనివారం రాత్రి తనిఖీలు చేస్తున్న ఈడీ అధికారులకు ఎన్‌సీబీ ఇంటెలిజెన్స్ నుంచి గంజాయి స్మగ్లింగ్ పై సమాచారం అందింది. టోల్‌ప్లాజా వద్ద ఓ లారీని ఈడీ చెక్ చేసి 140 పూలమొక్కల బ్యాగ్స్‌లో తరలిస్తున్న 3,400 కిలోల గంజాయిని, ట్రక్‌ను సీజ్ చేశారు. వైజాగ్ ఏజెన్సీ నుంచి మహారాష్ట్ర, బెంగళూర్, గోవాకు గంజాయి సప్లయ్ చేస్తున్నట్లు గుర్తించామని, మహారాష్ట్ర లాతూర్ ప్రాంతానికి చెందిన స్మగ్లర్స్ డి.షిండే, ఎమ్‌ఆర్ కాంబ్లీ, ఎన్.జోగానందను అరెస్ట్ చేసినట్లు ఆఫీసర్లు సోమవారం తెలిపారు.