పురుషోత్తపట్నంలో దేవస్థానం భూముల ఆక్రమణ

పురుషోత్తపట్నంలో దేవస్థానం భూముల ఆక్రమణ

భద్రాచలం, వెలుగు : ఏపీలోని విలీన ఎటపాక మండలం పురుషోత్తపట్నంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానం భూముల ఆక్రమణలకు గురవుతున్నాయి. అందులో పక్కా ఇండ్ల నిర్మాణం చేపడుతుండగా సోమవారం దేవస్థానం సిబ్బంది వెళ్లి అడ్డుకున్నారు. కానీ ఆక్రమణదారులు దౌర్జన్యం చేసి సిబ్బంది విధులకు ఆటంకం కల్పించారు.

 రోజూ ఆక్రమణదారుల ఆగడాలు పెరిగిపోతున్నాయని దేవస్థానం సిబ్బంది వాపోతున్నారు. ఎటపాక రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి విచారణ జరిపారు. ఏపీ హైకోర్టు ఉత్తర్వులు దేవస్థానంకు అనుకూలముగా ఉన్నప్పటికీ ఆక్రమణదారులు పెట్రేగిపోతున్నారని దేవస్థానం సిబ్బంది చెబుతున్నారు.