పాక్పై ఇంగ్లాండ్ క్రికెటర్ సంచలన కామెంట్స్

పాక్పై  ఇంగ్లాండ్ క్రికెటర్ సంచలన కామెంట్స్

పాకిస్తాన్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ జేసన్ రాయ్  సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్లో ఆడినన్నీ రోజులు మానసికంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆడిన జేసన్ రాయ్ ..తీవ్ర మానసిక క్షోభకు గురైనట్లు వెల్లడించారు. పాకిస్తాన్లో ఉన్నన్ని రోజులు తన జీవితంలో చీకటి రోజులని జేసన్ రాయ్ అభివర్ణించాడు. 

పాకిస్థాన్ సూపర్ లీగ్లో జేసన్ రాయ్..క్వా్ట్టా గ్లాడియేటర్స్ తరపున ఆడాడు.  50.50 ఆవరేజ్ తో 303 పరుగులు సాధించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్లో అతను బెస్ట్ ప్లేయర్గా పేరు తెచ్చుకున్నాడు. అయితే పీఎస్ఎల్లో సక్సెస్ అయినా కూడా..ప్రశాంతంగా ఉండలేకపోయాయనని జేసన్ రాయ్ చెప్పుకొచ్చాడు. మెంటల్ టెన్షన్కు గురయ్యానన్నాడు. పాకిస్తాన్లో ఉన్నప్పుడు విచిత్రమైన దేశంలో ఉన్న ఫీలింగ్ కలిగిందన్నాడు. క్రికెట్ను ఎంతో ఇష్టపడే తాను..పీఎస్ఎల్ ఆడుతున్నప్పుడు మాత్రం ఏ మాత్రం ఇష్టంగా ఆడలేకపోయానన్నాడు. 

పాకిస్తాన్ సూపర్ లీగ్ అనంతరం ఇంటికి వచ్చాకే కొద్దిగా టెన్షన్ నుంచి బయటపడ్డానని జేసన్ రాయ్ తెలిపాడు.  పీఎస్ఎల్ కోసం 50 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సి వచ్చిందని..ఆ సమయంలోనే తనకు బిడ్డపుట్టిందన్నాడు. బిడ్డకు దూరం అవడం కూడా మానసిక క్షోభకు ఒక కారణమని రాయ్ చెప్పుకొచ్చాడు. అయితే కుటుంబంతో రెండు నెలలు గడపడంతో తన మైండ్ , బాడీ రిఫ్రెష్ అయిందన్నాడు. ఇప్పుడు మళ్లీ ఇంగ్లాండ్ టీమ్ తరపున ఆనందంగా ఆడుతున్నానన్నాడు. ఇక ఐపీఎల్‌ 2022 సీజన్‌ మెగా వేలంలో జేసన్‌ రాయ్‌ని గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. అయితే బయోబబుల్‌ వల్ల తాను ఆడలేనని ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు జేసన్ రాయ్ వెల్లడించాడు.