ఎవరెస్ట్ శిఖరాన్నీ చెత్త కుప్పగా మార్చేశారు.. క్లీన్ అండ్ గ్రీన్ కు డిమాండ్

ఎవరెస్ట్ శిఖరాన్నీ చెత్త కుప్పగా మార్చేశారు.. క్లీన్ అండ్ గ్రీన్ కు డిమాండ్

ఎవరెస్ట్ శిఖరం.. ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతం.. దీన్ని అధిరోహించటం అనేది పర్వాతాహరోణులకు ఓ ఛాలెంజ్. ఇటీవల కాలంలో చాలా మంది ఎవరెస్ట్ ఎక్కి.. తమ ఘనత చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే పర్వతం మొత్తం చెత్తగా మారిపోతుందనే విమర్శలు వస్తున్నాయి పర్యావరణ వేత్తల నుంచి. మే 29వ తేదీ ఎవరెస్ట్ డే సందర్భంగా.. టెన్జీ షెర్ప్ చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతుంది.

ఎవరెస్ట్ పర్వతం.. 8 వేల 848.86 మీటర్ల దగ్గర 4వ బేస్ క్యాంప్ దగ్గర చెత్త పేరుకుపోవడం చూసి మనస్సు నిరుత్సాహానికి గురైంది. పర్వతంపై ఉన్న చెత్త సమస్యలను అత్యవసరంగా గుర్తించి.. నిబద్ధత, చిత్తశుద్ధితో తొలగించాల్సిన సమయం వచ్చేసింది. కఠినమైన నిబంధనలు అమలు చేయటంతోపాటు.. చెత్త తొలగింపు డిమాండ్ పై సంఘటితంగా కృషి చేద్దాం అంటూ.. ఎవరెస్ట్ డే సందర్భంగా చేసిన ట్విట్ వైరల్ అయ్యింది.  

ఎవరెస్ట్ శిఖరంపై చెత్త అనేది ఇప్పటి సమస్య కాదు.. కొన్నేళ్లుగా దీనిపై చర్చ నడుస్తుంది.ఇప్పటికే ఎవరెస్ట్ పర్వతంపై 11 వేల కేజీల వ్యర్థ పదార్థాలను, వస్తువులను తొలగించినట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ చెత్తలో ఎక్కువగా ప్లాస్టిక్ క్యాన్లు, ఆక్సిజన్ క్యాన్స్, టెంట్లు, తాళ్లు, షూలు, చెప్పులు వంటివే ఎక్కువగా ఉన్నాయి. పర్వతం ఎక్కేవారు తమ వెంట తీసుకెళుతున్న వస్తువుల్లో కొన్నింటిని పర్వతంపైనే వదిలేసి వస్తున్నారని.. దీని వల్ల వేల కిలోల చెత్త ఎప్పటికప్పుడు పేరుకుపోతుందని.. దీన్ని తొలగించటం అనేది సవాల్ తో కూడుకున్నదని నేపాల్ ప్రభుత్వం చెబుతోంది. దీనిపై త్వరలోనే కొత్త విధివిధానాలతోపాటు.. పర్వాతారోహకులు తీసుకెళ్లే వస్తువుల తయారీలోనూ మార్పులు తీసుకురావటం వల్ల చెత్త సమస్యకు పరిష్కారం లభిస్తుందని అంచనా వేస్తుంది నేపాల్ సర్కార్. 

ఎవరెస్ట్ పర్వతం 4వ బేస్ క్యాంప్ దగ్గర పేరుకుపోయిన చెత్త వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.