
రామడుగు, వెలుగు: రైతులకు ఇచ్చిన హామీలను పరిష్కరించకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రి గంగుల కమలాకర్ ఇంటిని, కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తామని కాంగ్రెస్ లీడర్లు హెచ్చరించారు. శుక్రవారం రామడుగు మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో ఆ పార్టీ లీడర్లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టపరిహారం, రూ.లక్ష రుణమాఫీ, రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులను వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు. మార్చి 23న రామడుగు మండలంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సీఎం కేసీఆర్.. నష్టపోయిన రైతులకు ఎకరాకు 10 వేలు నష్టపరిహారం ఇస్తామని ప్రకటించి నేటీకి ఇవ్వలేదన్నారు. కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్‌రెడ్డి, కాంగ్రెస్లీడర్లు తిరుపతి, శ్రీనివాస్‌రెడ్డి, రాజమల్లయ్య, సత్యప్రసన్నరెడ్డి, ఆంజనేయులుగౌడ్, బుచ్చయ్య, భీంరెడ్డి పాల్గొన్నారు.