ఎన్నెన్ని చిత్రాలో : కండెక్టర్ అయిన సీఎం, ఎమ్మెల్యే.. బస్సు నడిపిన మహిళా ఎమ్మెల్యే..

ఎన్నెన్ని చిత్రాలో : కండెక్టర్ అయిన సీఎం, ఎమ్మెల్యే.. బస్సు నడిపిన మహిళా ఎమ్మెల్యే..

కర్నాటక రాష్ట్రంలో.. ఎన్నికల హామీలో భాగంగా.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. జూన్ 12వ తేదీ ఈ మేరకు పథకాల్లో అమల్లోకి తెస్తూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హడావిడి చేశారు. ఓ మహిళా ఎమ్మెల్యే ఆర్టీసీ బస్సు నడిపితే.. మరో ఎమ్మెల్యే కండెక్టర్ అవతారం ఎత్తి ఉచిత టికెట్లను ఇష్యూ చేశారు. మరో ఎమ్మెల్యే మహిళలతో కలిసి బస్సులో ప్రయాణం చేశారు..

జూన్ 11న కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తామన్న హామీని నెరవేర్చింది. ఈ సందర్భంగా శక్తి పథకాన్ని ప్రారంభించిన సీఎం సిద్ధరామయ్య.. బస్సు కండక్టర్ గా మారి మహిళా ప్రయాణికులకు జీరో వాల్యూ టిక్కెట్లు జారీ చేశారు. ఆయనొక్కరే కాదు ఎమ్మెల్యే దర్శన్ ధృవనారాయణ కూడా బస్సు కండక్టర్‌గా పోజులిచ్చారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)కి చెందిన మహిళా ఎమ్మెల్యే రూపకళ ఎం శశిధర్ కూడా అధికారిక డ్రైవర్ సహాయంతో బస్సును (ప్రజా రవాణాను) నడుపుతూ కనిపించారు. వీరివురికి సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఈ పథకం కింద మొదటి ట్రిప్‌ను ఆస్వాదించడానికి కొంతమంది మహిళా ప్రయాణికులు ఎక్కడం కూడా ఈ ఫొటోల్లో కనిపిస్తోంది.

శక్తి పథకం

కర్ణాటకలోని మహిళలు KSRTC , BMTC బస్సులలో ఉచితంగా ప్రయాణించేలా శక్తి పథకం జూన్ 11 న ప్రారంభించారు అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ మ్యానిఫెస్టోలో జాబితా చేయబడిన ఐదు ఎన్నికల హామీలలో ఒకటైన ఈ హామీని కాంగ్రెస్ ఎట్టకేలకు అమలు చేసింది. ఈ పథకం కర్ణాటకలో నివాసం ఉండే మహిళలకు, రాష్ట్ర పరిమితుల్లో ప్రయాణానికి అందుబాటులో ఉంది. ఈ ఉచిత ప్రయాణ సేవ ప్రతిరోజూ 41.8 లక్షల మంది మహిళా ప్రయాణీకులకు ప్రయోజనం చేకూరుస్తుంది. దీని వల్ల రాష్ట్ర ఖజానాకు ఏటా రూ. 4,051.56 కోట్లు ఖర్చవుతుందని అధికారులు తెలిపారు. ఈ పథకం వల్ల పేద, దిగువ మధ్యతరగతి శ్రామిక మహిళల ప్రయాణ ఖర్చులు తగ్గుతాయని, పొదుపు ఇంటి ఖర్చులకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం వెల్లడించింది.

https://twitter.com/GOK_Updates/status/1667818315736322049